లొకేషన్లో...పవన్, సమంత, ప్రణీత, మిర్చి మదర్(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ బయటకు విడుదలయ్యాయి. షూటింగులో పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత తదితరులు పాల్గొన్న దృశ్యాలను క్రింద స్లైడ్ షోలో వీక్షించవచ్చు. మిర్చి చిత్రంలో ప్రభాస్ మదర్ గా నటించి నదియా కూడా ఈ షూటింగులో పాల్గొంటోంది. షూటింగ్ గ్యాప్‌లో కాస్త గ్యాప్ దొరికే సరికి సెల్ ఫోన్‌తో బిజీ అయిపోయింది సమంత.

ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ యూరఫ్ లో ప్లాన్ చేసారు. జూన్ మొదటి వారంలో అక్కడ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మొత్తం 25 రోజుల పాటు వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. ఈ మేరకు యూరప్ లోని లొకేషన్ల గురించి ఆరా తీస్తున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

లొకేషన్లో...పవన్, సమంత, ప్రణీత, మిర్చి మదర్ (ఫోటోలు)

అత్తారింటికి దారేది మూవీ లోకేషన్లో సమంత, నదియా, ప్రణీత తదితరలు...

లొకేషన్లో...పవన్, సమంత, ప్రణీత, మిర్చి మదర్ (ఫోటోలు)

షూటింగులో ఎంతో కూల్ గా ఉన్న పవన్ కళ్యాణ్, పక్కనే ప్రణీత

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X