అత్తారింటికి దారేది పైరసీ ఎలా జరిగింది?
హైదరాబాద్: ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఫిలింనగర్‌లో ఉంటున్నఅరుణ్ కుమార్ కానిస్టేబుల్ ప్రసన్న కుమార్ ఒత్తిడితో సినిమాలోని సగభాగాన్ని డివీడిలోకి ఎక్కించి ఇచ్చాడు. హోం థియేటర్ బొమ్మలే తప్ప మాటలు రాకపోవడంతో ఆ డీవీడిని మిత్రుడైన మరో కానిస్టేబుల్ అనూప్ ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి సినిమా చూశారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ ఎలా జరిగిందనే విషయాన్ని ఎస్పీ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు.
ఆ తర్వాత ఆ డివీడిని వారి స్నేహితుడైన ఎపిఎస్పీ కానిస్టేబుల్ కట్టా రవి తీసుకుని వెళ్లాడు. అతను ఈ నెల 14వ తేదీన పెడనలోని తన స్నేహితుడు సుధీర్ కుమార్‌కు స్పీడ్ పోస్టులో పంపించాడు. డీవీడి చూసిన సుధీర్ కుమార్ పెడనకు చెందిన తన స్నేహితుడు పోరంకి సురేష్‌కు ఇచ్చాడు. సురేష్ 4జిబిగా ఉన్ిన ఆ సినిమాను 160ఎంబీలోకి మార్చాడు. తర్వాత పెడనలోని దేవి మొబైల్ షాపులో సెల్‌ఫోన్ వాడే మెమెరీ కార్డుల్లోకి, సీడిల్లోకి ఎక్కించి అమ్మకం ప్రారంభించాడు.
సుధీర్ కుమార్ సోదరుడు కిశోర్ ఆ సినిమాను తన పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకున్నాడు. ఈ వ్యవహారం నేపథ్యంలో పైరసీ వ్యవహరం బయటపడింది. సినిమాను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించిన కిశోర్ తన స్నేహితుడు, మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లోని స్మార్ట్ లింక్స్ కమ్యూనికేషన్‌ను నడుపుతున్న గిరికి ఇచ్చాడు. గిరి ఆ సినిమాను యూట్యూబ్‌లో పెట్టాడు. స్మార్ట్ లింక్స్ కమ్యూనికేషన్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
పెద్దల హస్తంపై ఆరా..
నిర్మాత కంప్యూటర్ నుంచి సినిమా బయటకు రావడానికి ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఫోన్ నెంబర్ల ఆధారంగా, వారు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను తెలుసుకోవడం ద్వారా దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. అరుణ్ కుమార్ సెల్ నుంచి సినీ రంగ ప్రముఖులకు ఎవరికైనా కాల్స్ వెళ్లాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


Click it and Unblock the Notifications












