twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యామిలీ లీక్ స్టోరీ: నష్టం లేదు లాభమే..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆన్‌లైన్లో లీకైన సంగతి తెలిసిందే. దాదాపు 90 నిమిషాల నిడివిగల మూవీ పైరసీకి గురైంది. ఈ సంఘటనతో షాకైన నిర్మాతలు ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు పైరసీపై వేట ప్రారంభించారు. పోలీసులు సీడీ షాపులపై దాడులు ప్రారంభించారు.

    మరో వైపు సినిమాను రెండు వారాల ముందుగానే, అంటే సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే...ఈ లీకులు తమ హీరో సినిమాను ఏమీ చేయలేవని అంటున్నారు అభిమానులు. పైగా సెప్టెంబర్ విడుదల కాబట్టి సెంటిమెంటు కలిసొచ్చి హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు నమ్మకం వెనక కారణాలు కూడా లేక పోలేదు. వారు చెబుతున్న కారణాలు ఏమిటో చూద్దాం...

    లీక్ అవ్వడం శుభమేనా?

    2008లో పవర్ స్టార్ నటించిన 'జల్సా' సినిమా సాంగులు అప్పట్లో లీకయ్యాయి. సినిమా సూపర్ హిట్టు
    2009లో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలోని హార్స్ రైడింగ్ సీన్ లీకైంది. ఇండస్ట్రీ హిట్
    2012 రచ్చ టైటిల్ సాగ్ లీకైంది. సినిమా సూపర్ హిట్ అయింది.
    2012లో ఎంపీ3 టైటిల్ సాంగ్ లీక్. సినిమా మెగా హిట్
    2013లో రామ్ చరణ్ నటించిన 'ఎవడు'ఐటం సాంగ్ లీకవ్వడం, పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఫస్టాఫ్ లీక్ అవ్వడం కూడా కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

    సెప్టెంబర్ సెంటిమెంట్

    గతంలో సెప్టెంబర్ నెలలో విడుదలైన మెగాఫ్యామిలీ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. 2006, సెప్టెంబర్ 20న విడుదలైన చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రం సూపర్ హిట్ అయింది. అదే విధంగా 2003 సెప్టెంబర్ 24న విడుదలైన ఠాగూర్ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్. 2007 సెప్టెంబర్లో వచ్చిన 'చిరుత' మూవీ కూడా హిట్టే. ఈ క్రమంలో సెప్టెంబర్ 27న విడుదలవుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రం కూడా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.

    పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Producer BVSN Prasad is successful in taking control over the alleged piracy of movie Attarintiki Daredi, which was leaked online on Sunday night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X