పవన్ ‘అత్తారింటికి దారేది’ వాయిదా పడింది
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల తేదీ ఆగస్టు 7న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 9కి వాయిదా వేసారు. థియేటర్ల అడ్జెస్ట్ మెంటే ఈ వాయిదాకు కారణంగా తెలుస్తోంది.
ఈ విడుదల వెనక ఓ సెంటిమెంటు కారణం కూడా వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ 'జులాయి' గత సంవత్సరం ఆగస్టు 9నే విడుదలయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు సెంటిముంటుగా భావించి రిలీజ్ డేట్ మార్చినట్లు తెలుస్తోంది.
మరో వైపు 'అత్తారింటికి దారేది' చిత్రం శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని స్పష్టం అయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.
ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












