పవన్ ఎఫెక్ట్: 50 లోనూ స్ట్రాంగ్ రన్...!
హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' చిత్రం 15వ తేదీతో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం 50 రోజుల్లోనూ సినిమా బక్సాఫీసు వద్ద స్ట్రాంగ్‌గా రన్ అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ ఎఫెక్టే అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈచిత్రం 170 సెంటర్లలో 50 రోజులు వేడుక జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
'టాలీవుడ్‌లో హయ్యస్ట్ షేర్స్ కలెక్ట్ చేసిన టాప్ వన్ చిత్రంగా మా 'అత్తారింటికి దారేది' చిత్రం నిలిచినందుకు ఆనందంగా ఉంది. ఇంతటి పెద్ద హిట్ అందించిన ప్రేక్షకులకు, పవర్ స్టార్ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ సెన్సేషన్ హిట్‌కి కారణం. దేవిశ్రీ మ్యూజిక్, సమంత గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అన్ని సెంటర్లలోనూ ఇప్పటికీ కలెక్షన్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి' అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్-2' చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.


Click it and Unblock the Notifications












