»   » ద్రాక్ష తోటల్లో పవన్‌ కళ్యాణ్ సందడి

ద్రాక్ష తోటల్లో పవన్‌ కళ్యాణ్ సందడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌, సమంత జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని ద్రాక్ష తోటల పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నారు.

ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఇటీవలే స్పెయిన్‌లో ముఖ్య సన్నివేశాల్నీ, పాటల్నీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో హిందీ నటుడు బొమన్‌ ఇరానీ ఓ ముఖ్య పాత్ర పోషించారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

నిర్మాత మాట్లాడుతూ... ''జల్సా తరవాత పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ల నుంచి వస్తున్న చిత్రమిది. సరదాసరదాగా సాగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో సెట్‌ని వేసాం. అక్కడ ఓ పాటను తెరకెక్కిస్తాం. ఈ నెలలో పాటల్నీ, వచ్చే నెల 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు సాగుతున్నాయి'' అని తెలిపాయి.

అలాగే హీరోయిన్ సమంత పవన్ కళ్యాణ్ సినిమా-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. ఈ చిత్రానికి 'మాటలతో మాయ' అనే ట్యాగ్ లైన్ ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. గతంలో 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ అంటూ సమంతనే ట్విట్టర్ ద్వారా చెప్పింది.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Pawan Kalyan, Samantha, Praneetha starrer ‘Attarintiki Daaredi’ is starting its Hyderabad schedule . Film is progressing in RFC where comedy scenes are canned on other actors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu