»   » ‘అత్తారింటికి దారేది’ చారిటీ‌షో టిక్కెట్స్ కావాలా...

‘అత్తారింటికి దారేది’ చారిటీ‌షో టిక్కెట్స్ కావాలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ముందుగా పైరసీ కారణంగా......అక్టోబర్ 9న కాకుండా అనుకున్న దానికంటే ముందుగా సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. పవర్ స్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 27న సినమా విడుదలవుతున్న నేపథ్యంలో స్పెషల్ చారిటీషో నిర్వహించి ఈ షోకు కలెక్టయిన డబ్బులను సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు హైదరాబాద్ కూకపట్ పల్లిలోని విశ్వనాథ్ థియేటర్ల సెప్టెంబర్ 27 తేదీ ఉదయం 4 గంటలకు 'స్పెషల్ చారిటీ షో'కు ఏర్పాట్లు చేసారు. ఈ షోకు బాల్కనీ టిక్కెట్ ధర రూ. 1200గా కేటాయించినట్లు తెలుస్తోంది. రూ. 800, 600 రేంజిలో కూడా టిక్కెట్స్ అందుబాటులో ఉన్నాయి. షో నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని సేవాకార్యక్రమానికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

టిక్కెట్స్ కావాల్సిన వారు 7842718273, 9704087356, 9618612629, 9000538383, 8143555771, 9951592967, 9618883556 నెంబర్లను సంప్రదించాల్సిందిగా అభిమాన సంఘాలు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా తెలియజేస్తున్నాయి. మరి ఈ షో ద్వారా ఎంత కలెక్ట్ అవుతాయో చూడాలి.

'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని స్పష్టం అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రల్లో నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Atharintiki Daredi special charity Show. Pawan has given his nod to arrange a special "Charity" show on Sep 27, 4.00 am at Vishwanath theatre in Kukatpally, Hyderabad where many T-town celebs are expected to sizzle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu