రేపే ‘అత్తారింటికి దారేది’ టీజర్, ఈలోపే లీక్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' ఫస్ట్ లుక్ టీజర్ రేపు(జులై 14) విడుదలవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లోపే అందులోని కొన్ని డైలాగులు బయటకు లీకయ్యాయి. ఆ డైలాగులు క్రింది విధంగా ఉన్నాయి.

అరువ...నీకు ఓపికున్నంత వరకు...నీ వాయిస్ లో బేస్ ఉన్నంత వరకు
ఎగురు...నీ కాళ్లలో సత్తా ఉన్నంత వరకు..
కానీ సూటిగా చూడకు...స్ట్రైట్‌గా రాకు...
నా కళ్లలో పవర్ చూసి తట్టుకోలేవు. నా రూట్లో ఇమడలేవు

నోట్లో మాట..గన్‌లో తూటా వెస్ట్‌‌గా ఉండకూడదు..
నోరు జారినా..తూటా పేలినా ప్రాణాలు పోతాయ్

గతంతోనూ కొన్ని డైలాుగుల లీకయ్యాయి. అవి మరోసారి....

ప్రణీత, పవన్ మధ్య డైలాగు
ప్రణీత: "నువ్వు ఐ మూలగా(డైయగ్నల్) అంటూ అమ్మాయిలకు ఏదో లెక్చర్ ఇస్తావంటగా....?"
పవన్: "అది అంతా అలాంటి అండర్ కలర్ బ్యూటీస్ కి బుజ్జీ...నువ్వు ఎటు చూసినా...ఎలా చూసినా పిల్లోడు నాశనం."

అలాగే పవన్ , అలీ మధ్య డైలాగు
అలీ - "ఈ పిల్ల ని బౌండరీ దాటించటం అంత ఈజీ కాదు, చాలా భారీ ఫీల్డింగ్ పెట్టాడు వాడు".
పవన్- "చూడమ్మా సింగిల్ కొట్టాలి అనుకున్నవాడే ఫీల్డర్ ని చూసి ఆడతాడు. నాలాగ సిక్స్ కొట్టాలి అని ఫిక్స్ అయిన వాడికి ఫీల్డర్ ఎక్కడున్న పెద్దగా ఏ ఫీలింగ్ ఉండదు ".

'అత్తారింటికి దారేది' చిత్రం చూస్తే, హ్హహ్హహ్హ...హ్హహ్హహ్హ...హ్హహ్హహ్హ అంటూ కడుపారా నవ్వుకోవచ్చు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని పూర్తి ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో హాస్యభరితంగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ ఈ సినిమా కోసం మంచికామెడీ టైమింగ్ ఉన్న పంచ్ డైలాగులను బోలెడు రాసాడట. ఈ సినిమాలో నటిస్తున్న వారు సైతం ఆ డైలాగులు విని ఔరా అంటున్నారు. ఇటీవల హీరోయిన్ సమంత దర్శకుడు త్రివిక్రమ్ డైలాగులను ఓ రేంజిలో పొగిడేసింది. ఆయన మాటలతో మాయచేస్తారని, ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని కితాబిచ్చేసింది.

ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ అఫీషియల్‌గా ఖరారు చేసారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుందని దాన్నే ఖరారు చేసాం' అన్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X