»   » వివాదంలో ‘అత్తారింటికి దారేది’, పవన్ సీరియస్!

వివాదంలో ‘అత్తారింటికి దారేది’, పవన్ సీరియస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' చిత్రం సూపర్ హిట్ కలెక్షన్లతో తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. నెం.1 స్థానంలో ఉన్న 'మగధీర' రికార్డు సైతం బద్దలు కొట్టిన ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకునే దిశగా సాగుతోంది.

సినిమా బంపర్ హిట్ అయిందన్న ఆనందంలో ఉన్న చిత్ర నిర్మాతలు......ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు వివాదాస్పదంగా మారాయి. 'వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలోనే పెద్ద హిట్ట అంటూ' పోస్టర్లపై ప్రకటించడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్లో ఇంతకంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు బోలెడు ఉండటమే అందుకు కారణం.

పోస్టర్లపై ఇలా అవాస్తవాలు ప్రకటించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం అయింది. చివరకు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన నిర్మాతల తీరుపై కాస్త సీరియస్ అయినట్లు సమాచారం. వెంటనే అ పోస్టర్లను సరిచేయాలని, కొత్త పోస్టర్లు విడుదల చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

English summary
Attarintiki Daredi 5th Week Wallpapers released. However in the posters they claimed that the film is biggest hit in 100yrs of Indian Cinema. This ruffled many feathers as Attarintiki Daaredi is boasting to be biggest hit in Indian film industry even surpassing Bollywood films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu