పైరసీ ఎఫెక్ట్...27నే ‘అత్తారింటికి దారేది’ రిలీజ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అక్టోబర్ 9 విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న దానికంటే రెండు వారాల ముందుగా....సెప్టెంబర్ 27నే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల ముందే లీకవ్వడంతో పాటు....పైరసీ సీడీలు విజయవాడలో బయల్పడ్డాయి. దీంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సినిమా బయటకు లీకవ్వడం పట్ల నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసారు.
అత్తారింటికి దారేది పైరసీ సీడీల విషయం బయటకు తెలియగానే యాంటీ పైరసీ విభాగం అప్రమత్తమైంది. ఆ సీడీలు స్ర్పెడ్ కాకుండా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మీకు ఎక్కడైనా అత్తారింటికి దారేది పైరసీ సీడీలుగానీ, ఇంటర్నెట్లో అలాంటి లింక్స్ గానీ కనిపిస్తే...[email protected], [email protected] కు ఈమెయిల్ చేయండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.
పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












