'కత్తి'పై పవన్ ఫ్యాన్స్ కన్ను: 'అజ్ఞాతవాసి'పై ఏం తేలుస్తాడో?.. సర్వత్రా ఉత్కంఠ..

ఓవైపు ఇంకా సద్దుమణగని వివాదం.. ఇంతలోనే పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా. యథాప్రకారం ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి సినిమా చూడటానికి వెళ్లారు. కానీ బయటకొచ్చి ఆయనేం చెబుతారు?.. దానిపై ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారు? అన్నదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోన్న విషయం. పవన్ ఫ్యాన్స్‌తో వివాదం నేపథ్యంలో అటు సామాన్య జనంలోనూ కత్తి రివ్యూపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఆయనేం చెబుతున్నారో!:

ఆయనేం చెబుతున్నారో!:

బంజారాహిల్స్ ప్రసాద్స్ ల్యాబ్స్‌లో 'అజ్ఞాతవాసి' సినిమా చూసేందుకు వెళ్లారు మహేష్ కత్తి. నేటి ఉదయం 8గంటలకు మొదటి 'షో' పడింది. ప్రస్తుతం సినిమా చూస్తున్న ఆయన.. బయటకొచ్చి ఎలాంటి రివ్యూ చెబుతారో అన్న క్యురియాసిటీ అటు మీడియాను, ఇటు అభిమానులను వెంటాడుతోంది.

చూసొచ్చాకే!..:

చూసొచ్చాకే!..:

మహేష్ కత్తి థియేటర్ లోకి వెళ్లేముందు కొంతమంది మీడియా ప్రతినిధులు సినిమాపై స్పందించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే సినిమా చూసి వచ్చాకే మాట్లాడుతానని చెప్పి ఆయన లోపలికెళ్లిపోయినట్లు సమాచారం.

'లార్గో వించ్' గురించి ప్రస్తావిస్తారా?:

'లార్గో వించ్' గురించి ప్రస్తావిస్తారా?:

'అజ్ఞాతవాసి' సినిమాపై కాపీ ఆరోపణలు చేసిన మహేష్ కత్తి.. సినిమా చూశాక ఎలాంటి విశ్లేషణ అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 'లార్గో వించ్' సినిమాతో 'అజ్ఞాతవాసి'కి దగ్గరి ఛాయలు ఉన్నాయని చెబుతారా?.. లేక త్రివిక్రమ్ తన మార్క్‌తో అలాంటి ఛాయలు కనబడకుండా చేశారని చెబుతారా? అన్నది వేచి చూడాలి.

ట్రైలర్‌పై ప్రశంసలు:

ట్రైలర్‌పై ప్రశంసలు:

త్రివిక్రమ్‌పై కాపీ ఆరోపణల సంగతి పక్కనపెడితే.. 'అజ్ఞాతవాసి' ట్రైలర్ బాగుందని ఇదివరకే ప్రశంసించారు మహేష్ కత్తి. అయితే ఆ ప్రశంసలు ట్రైలర్‌కే పరిమితమవుతాయా?.. లేక సినిమా కూడా ఆయన్ను ఆకట్టుకుంటుందా? అన్నది చూడాలి.

Recommended Video

అజ్ఞాతవాసి తొలి రివ్యూ వచ్చేసింది.. పవన్ కుమ్మేశాడు..!
'కత్తి'పై ఫ్యాన్స్ కన్ను:

'కత్తి'పై ఫ్యాన్స్ కన్ను:


గతంలో కాటమరాయుడు సినిమా రివ్యూతోనే పవన్ ఫ్యాన్స్‌కు కత్తి మహేష్‌కు మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ రివ్యూపై పవన్ ఫ్యాన్స్ ఓ కన్నేసి ఉంచారు.

ఆయన నెగటివ్ రివ్యూ చెబితే గనుక మరోసారి ఫ్యాన్స్ ఆయనపై విరుచుకుపడే అవకాశం లేకపోలేదు. అయితే కత్తితో వివాదం వద్దంటూ కోన వెంకట్ లాంటి వ్యక్తులు ఇప్పటికే అప్పీల్ చేయడంతో.. అభిమానులు ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X