ప్రభాస్ సినిమా గురించి అలా ఊహించుకుంటే.. ఇదేం ట్విస్టు.. సాహోలో హైలైట్ ఏంటంటే!

Recommended Video

Saaho Updates:Saho Movie Has A New Twist In Its Story

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ ఏడాది ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులు సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. కళ్ళు చెదిరే యాక్షన్ చిత్రంగా సాహోని దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సాహో గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

కళ్ళు చెదిరేలా యాక్షన్

కళ్ళు చెదిరేలా యాక్షన్

సాహో చిత్రం 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఈ చిత్రంలో అంతర్జాతీయ దొంగగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దుబాయ్, అబుదాబి, రొమేనియా లాంటి విదేశాల్లో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలని రూపొందించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో ప్రభాస్ చేసే పోరాటాలు ఉంటాయని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

షాకింగ్ ట్విస్ట్

షాకింగ్ ట్విస్ట్

అద్భుతమైన విజువల్స్, ఛేజింగ్ సీన్స్, రోమాలు నిక్కబొడుచుకునేలా ప్రభాస్ పోరాటాలు.. అభిమానులంతా సాహో చిత్రం గురించి ఇలా ఊహించుకుంటున్నారు. కానీ తాజాగా వస్తున్న వార్తలు అందుకు భిన్నంగా ఉన్నాయి. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు కామెడికూడా హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం పగలబడి నవ్వే విధంగా ఉంటుందని అంటున్నారు. అది కూడా రెగ్యులర్ కామెడీ కాదట.

రజనీకాంత్ సినిమాల్లో

రజనీకాంత్ సినిమాల్లో

ఒక్క మాటలో చెప్పాలంటే రజనీకాంత్ సినిమాల తరహాలో సాహో సాగుతుందని అంటున్నారు. రజని చిత్రాల్లో యాక్షన్, కామెడీ సపరేటుగా ఉండదు. రాజనీకాంతే విలన్లపై నట కామెడీ పంచులతో ఎంటర్ టైన్ చేస్తారు. సాహో చిత్రంలో కూడా ప్రభాస్ పాత్ర అదే విధంగా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

 సాహో తర్వాత లవ్ స్టోరీ

సాహో తర్వాత లవ్ స్టోరీ

సాహో చిత్రం కొనసాగుతుండగానే ప్రభాస్ రాధాకృష్ణ దర్శత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధాకృష్ణ 1960 నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈచిత్రంలో ప్రభాస్ కార్ల వ్యాపారిగా కనిపిస్తాడని టాక్. మంచి ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X