పవన్ ‘అత్తారింటికి దారేది’ లేటెస్ట్ ఫోటోలు (న్యూ)

By Bojja Kumar

హైదరాబాద్ : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఆగస్టు 7న విడుదలవుతున్న ఈచిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'జల్సా' లాంటి హిట్ మూవీ కాంబినేషన్ కావడమే ఇందుకు కారణం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, అలీ, బోమన్ ఇరానీ, నదియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని పూర్తి వినోదాత్మకమైన చిత్రంగా, ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మంచి స్పందన వస్తోంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా పలు రికార్డులు నెలకొల్పిన ఈచిత్రం విడుదల తర్వాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు.

యూట్యూబులో రికార్డ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైంది. తాజాగా విడుదలైన ‘అత్తారింటికి దారేది' టీజర్ యూట్యూబులో రికార్డు స్థాయిలో హిట్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్ కేవలం ఒకటిన్నర రోజులో దాదాపు 5 లక్షల హిట్స్, పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజిలో యూట్యూబులో సంచలనం సృష్టించలేదు.

నిర్మాతకు లాభాల పంట

మరో వైపు సినిమా విడుదలకు ముందే భారీ ఎత్తున రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి అన్ని రకాల రైట్స్ ఇప్పటికే రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయాయి. సినిమా విడుదలకు ముందు నిర్మాతకు పెట్టుబడి తిరిగి రావడమే కాదు, భారీ ఎత్తున లాభాలు వచ్చాయట. ఇక సినిమా విడుదలైతే కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.

ఆడియో వేడుక వివరాలు

‘అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో విడుదల తేదీతో పాటు వేదిక కూడా ఖరారైంది. ఈ నెల 19న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆడియో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

పూర్తి వినోదాత్మక చిత్రం

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని పూర్తి వినోదాత్మకమైన చిత్రంగా, ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. .ఈ చిత్రంలో పవన్-బ్రహ్మానందం మధ్య వచ్చే కామోడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నాయి. ఈ చిత్రంలో పవన్ ఓ సీన్లో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు.

సాంకేతిక నిపుణుల వివరాలు

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X