»   » పవన్-మహేష్ అభిమానులకు పండగ రోజు!

పవన్-మహేష్ అభిమానులకు పండగ రోజు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న స్టార్ హీరోలు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒకే రోజు సంబరాలు చేసుకోబోతున్నారు. ఆ రోజే మరేదో కాదు...ఆగస్టు 09.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....పవన్ కళ్యాణ్-మహేష్ బాబు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. అయితే సినిమాల పరంగా చూస్తే ఇద్దరూ ఒకరిని తీసిపోకుండా ఒకరు తమ సత్తా చాటుతున్నారు.

Pawan Kalyan-Mahesh Babu

ఆగస్టు 09 సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. 1975లో జన్మించిన మహేష్ బాబు వచ్చే శుక్రవారంతో 38వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. అభిమాన హీరో పుట్టినరోజంటే అభిమానులకు పండగ రోజే. మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1' సినిమా షూటింగులో భాగంగా లండన్లో ఉన్న మహేష్ బాబు అక్కడే యూనిట్ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 వరకు లండన్లోనే షూటింగ్ జరుగనుంది.

ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఈ రోజు పండగ రోజు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 09న విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా విడుదల తేదీ కోసం క్షణమొక యుగంలా గడుపుతున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

English summary
Pawan Kalyan is coming on to screen on Mahesh Babu’s birthday. Well, that’s the release of Attarintiki Daredi directed by Trivikram Srinivas starring Pawan Kalyan. The movie postponed to August 9th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu