వేలం పాటలో పాల్గొనండంటూ దాసరి రిక్వెస్ట్
'యంగ్ ఇండియా' ఆడియో సిడిని వేలం వేసి తద్వారా వచ్చే మొత్తాన్ని ఎ.పి. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సహాయనిధికి ఇవ్వనున్నాం. కళాహృదయంతో పేద కార్మికులకు సహాయం చేయాలనుకునేవారు ఈ వేలంపాటలో పాల్గొనాలని కోరుతున్నాం' అని డా.దాసరి నారాయణరావు అన్నారు. 81మంది నూతన నటీనటులను పరిచయం చేస్తూ దాసరి రూపొందిస్తున్న 149వ చిత్రం 'యంగ్ ఇండియా' ఈ నెలలోనే రిలీజుకానుంది. శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైలి పతాకంపై కె.రామకృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక ఈ నెల 10న జరుగనుంది.
అదే రోజు సంగీత దర్శకుడు కీరవాణిని ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మా సినిమా తొలి ఆడియో సిడిని వేలం వేస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మా దర్శకులు దాసరి నారాయణరావు రూపొందించిన 'మాయాబజార్' చిత్రం ఆడియో సిడిని వేలం వేసి ఓ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో 'యంగ్ ఇండియా' చిత్రానికి చేస్తున్నాం అన్నారు. ఇక వేలం పాట కార్యక్రమాలు తెలుగు పరిశ్రమలో జోరుందుకున్నాయి. ఇంతకు ముందు ఎన్టీఆర్ అదుర్స్ చిత్రంలోని టోపి,కోటులను మా అశోసియోషన్ వేలం వేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











