నేను రవితేజాని కాదు, నాకు ఫోన్ చేయకండీ: రాజా ది గ్రేట్ తెచ్చిన చిక్కు, దర్శకుడిపై కేసు పెడతాడట

రవి తేజా హీరోగా వచ్చిన "రాజా ది గ్రేట్" సినిమా వల్ల విశాఖ జిల్లా లోని ఒక కుగ్రామం లో ఉండే గోపీ అనే వ్యక్తి ఇబ్బంది మామూలుగాలేదు. ఇంతకీ ఆ సినిమాకీ, రవితేజ కీ మన గోపీ కీ ఏ సంబందమూ లేదు అయినా అంతగా అతన్

కొన్నిసార్లు సినిమాల్లో వచ్చే సీన్లు మనలని పర్సనల్ గా ఇబ్బది పెడతాయి. ఇదికాస్త వింతగా అనిపించవచ్చుగానీ అసలు సంబందమే లేని విషయం లో ఒక సినిమావల్ల గత నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కుంటున్నాడు ఒక వ్యక్తి. అదీ రవి తేజా హీరోగా వచ్చిన "రాజా ది గ్రేట్" సినిమా వల్ల. సినిమా వచ్చిన రోజునుండీ విశాఖ జిల్లా లోని ఒక కుగ్రామం లో ఉండే గోపీ అనే వ్యక్తి ఇబ్బంది మామూలుగాలేదు. ఇంతకీ ఆ సినిమాకీ, రవితేజ కీ మన గోపీ కీ ఏ సంబందమూ లేదు అయినా అంతగా అతన్ని భాదిస్తున్న విషయం ఏమిటంటే....

Recommended Video

Raja the Great Movie Public Talk - Filmibeat Telugu
రవితేజ గారండీ..?

రవితేజ గారండీ..?

పాపం అతని ఫోన్ నంబర్ ని ఆ సినిమాలో వాడటం వల్ల వచ్చిన చిక్కు ఇది...దీంతో సినిమా చూసిన చాలామంది ఆ నంబరుకు ఫోన్‌ చేసి "రవితేజ గారండీ..? సినిమా ఎంతో బాగుంది.., మీ నటన అద్భుతం" అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో నాలుగు రోజులుగా విరామం లేకుండా ఫోన్‌ కాల్స్‌ వస్తుండడంతో విసుగెత్తిన గోపి చివరకు తన ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసుకోవాల్సి వచ్చింది.

రోజుకి వందలాది కాల్స్

రోజుకి వందలాది కాల్స్

ఇక ఈ వరుస ఫోన్ కాల్స్ వల్ల పిచ్చెక్కినంత పనైన గోపీ పాపం తన ఫోన్ మోగిందంటే చాలు చిరాకు పడిపోతున్నాడట. ఒకరూ ఇద్దరికి చెప్పొచ్చు కానీ రోజుకి వందలాది కాల్స్... ప్రతీదానికీ చిరాకు పడకుండా సమాధానం చెప్పలి.. పాపం ఇక ఆ భాధ భరించలేక ఆయన రాసిన ఉత్తరాన్ని ఒక పత్రిక ప్రచురించింది.. ఆయన భాధ ఎలాఉందో ఆయన మాటల్లోనే చూడండి...

నా పేరు లంకలపల్లి గోపి

నా పేరు లంకలపల్లి గోపి

"నా పేరు లంకలపల్లి గోపి. మాది విశాఖ జిల్లా ఆనందపురం గ్రామం. వృత్తిరీత్యా వడ్రంగి అయిన నేను నిన్నమొన్నటి వరకూ ఎంతో ప్రశాంతంగా బతికేవాడిని. అయితే ‘రాజా ది గ్రేట్‌' సినిమా రిలీజైన నాటినుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో విలన్‌ను ఉద్దేశించి హీరో తల్లి రాధిక... ‘‘ఇదిగో నా కొడుకు ఫోన్‌ నంబరు. నీకు దమ్ముంటే ఏమైనా చేసుకో' అని సవాల్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన నంబరు 80745xxxxx నాదే. అయితే అది నిజంగానే రవితేజ ఫోన్‌ నంబరు అనుకున్న అభిమానులు నాకు తెగ ఫోన్లు చేసేస్తున్నారు.

ఆ నంబర్‌ రవితేజది కాదు

ఆ నంబర్‌ రవితేజది కాదు

దీంతో పనులు మానుకుని మరీ ఆ నంబర్‌ రవితేజది కాదు, నాది అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఒకటి, రెండు కాల్స్‌ అయితే ఫర్వాలేదు.. కానీ మరీ వేలల్లో వచ్చే కాల్స్‌కు సమాధానం చెప్పడం కష్టంగా ఉంది. ఈ బాధ తట్టుకోలేక ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి, నాకు అవసరమైనప్పుడే ఆన్‌ చేసుకుంటున్నా. అభిమానులకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే... దయచేసి ఈ నంబరుకు ఫోన్‌ చేయొద్దు...! అసలు నా అనుమతి లేకుండా నా ఫోన్‌ నంబర్‌ను వినియోగించుకున్నందుకు ‘రాజా ది గ్రేట్‌' సినిమా డైరెక్టర్‌పై కేసుపెట్టే ఆలోచన కూడా ఉంది

ఇట్లు,
లంకలపల్లి గోపి, ఆనందపురం(విశాఖ జిల్లా).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X