నటవారసులను ప్రేక్షకులు భరించాల్సిందేనా?
కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దలు ఊరికే అన్నారు కాబోలు సినిమా రంగంలో కూడా వారసత్వం వద్దన్నా ఆగదు. వాళ్ల గుల తీరే వరకు ప్రజల మీద నటనా దాడి చేస్తూనే ఉంటారు. తాతలు, తండ్రలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటూ ఎగబడిపోతారు. ప్రఖ్యాత దర్శకుడు ఎ. కోదండ రామి రెడ్డి కొడుకు వైభవ్ 'గొడవ" అనే సినిమాతో జనం మీద పడ్డాడు. కానీ ప్రజలు విసిరేసారు. ఆదెబ్బ నుంచి తట్టుకుని 'కాస్కొ" అంటూ మళ్ళీ ఒంటి కాటిమీద లేస్తున్నాడు.
నిజానికి వైభవ్ లో ఏం చూసి ఆదరించాలో తెలియక ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. కేవలం ఒక పెద్ద దర్శకుడి పుత్రరత్నం అని తప్పితే నటన అనేది కనబడటం లేదు. వైభవ్ మాత్రం ఇంకా పట్టువదలని విక్రమార్కుడి లా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
గొడవ వైభవ్ శ్రద్దా ఆర్య ఎ కోదండ రామి రెడ్డి కాస్కో గౌరి పండిట్ సత్యం రాజేశ్ శ్వేత ప్రసాద్ godava vaibhav sradha arya kodandarami reddy kasko gowri pandit satyam rajesh swetha prasad


Click it and Unblock the Notifications