సినిమా క్యాన్సిల్: హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి
సినిమా ప్రేమికులకు హైదరాబాద్‌లోని ఐమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమాల నుంచి హాలీవుడ్ చిత్రాల వరకు ఏదైనా ఇక్కడ విడుదల అవుతుంది. అందుకే నగరంలోని ఎక్కువ మంది సినీ ప్రియులు ఈ థియేటర్‌లో సినిమా చూడడానికి ఎగబడుతుంటారు. అందుకే ఐమాక్స్ చాలా ఫేమస్ అయింది. కానీ, తాజాగా అక్కడ నిర్వహకులు చేసిన పనికి జనాలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

నగరంలోనే ఫేమస్
కేవలం సినిమాలను ఇష్ట పడేవాళ్లకు మాత్రమే కాదు.. రాజధాని నగరాన్ని చూడాలని వచ్చే వారందరూ ఐమాక్స్‌కు వెళ్లాలనుకుంటారు. అంతగా.. ఈ మల్టిఫ్లెక్స్ థియేటర్ పాపులర్ అయింది. దీనికితోడు, స్పెషల్ షోలు కూడా ఇక్కడే ఎక్కువగా వేస్తుండడం కూడా ఈ థియేటర్ పేరు మారుమ్రోగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు.

హాలీవుడ్ సినిమా కోసం..
అంతటి పేరున్న ఐమాక్స్‌కు అప్పుడప్పుడు మరకలు పడుతుంటాయి. తాజాగా అక్కడ కొందరు ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం హాలీవుడ్ చిత్రమైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బోజ్‌పూరీ, పంజాబీ, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజ్ అయింది. ఇది, ఐమాక్స్‌లో కూడా విడుదలవుతున్నట్లు ప్రకటించారు. దీంతో అంతా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు.

షో క్యాన్సిల్ చేశారు
తీరా అక్కడకు వెళ్తే మొదటి షోను క్యాన్సిల్ చేశామని థియేటర్ సిబ్బంది వెల్లడించారు. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వారంతా గొడవకు దిగారు. థియేటర్ సిబ్బంది కూడా సర్ధి చెప్పకుండా దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అంతేకాదు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని అన్నట్లు సమాచారం. ఈ షో ఎందుకు క్యాన్సిల్ అయిందన్న విషయం మాత్రం తెలియలేదు.

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఎనిమిది చిత్రాలు రాగా.. ఇప్పుడు తొమ్మిదో భాగం ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చింది. జాసన్ స్టాథమ్, డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు డేవిడ్ లిచ్ తెరకెక్కించారు. దీనికి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: హాబ్స్ అండ్ షా' టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం. స్ట్రీట్ రేసింగ్ నేపథ్యంతో యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications











