twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి అల్లుడు ‘విజేత’ అయ్యాడా? టాక్ ఎలా ఉంది?

    By Bojja Kumar
    |

    మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం 'విజేత'. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి నిర్మించారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని కొందరు అంటుంటే... తండ్రీ, కొడుకుల అనుబంధం కొత్తగా, ఆకట్టుకునే విధంగా చూపించారని మరికొందరు అంటున్నారు.

    సింపుల్ స్టోరీ...

    సింపుల్ స్టోరీ...

    ప్రయోగాలకు పోకుండా తండ్రీ, కొడుకుల అనుబంధం, ఒక మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. తండ్రి పాత్రలో మురళి శర్మ నటించారు. అతడొక టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్. ఫ్యామిలీ కోసం తన పాషన్ వదులుకుంటాడు. తన కొడుకు రామ్(కళ్యాణ్ దేవ్) ఒక మంచి ప్రొఫెషన్లో స్థిరపడాలని ఆశపడతాడు. అయితే రామ్‌ జీవితం, కెరీర్ పట్ల సీరియస్‌గా ఉండడు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి(మాళవిక)తో ప్రేమలో పడ్డ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది తర్వాతి కథ.

    కళ్యాణ్ దేవ్ ఫర్వాలేదంట...

    కళ్యాణ్ దేవ్ ఫర్వాలేదంట...

    తొలి సినిమా అయినప్పటికీ కళ్యాణ్ దేవ్ నటన పరంగా ఫర్వాలేదనిపించాడని, నాట్ బ్యాడ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాళవిక నాయక్ తన పాత్రకు న్యాయం చేసిందని, హీరో- హీరోయిన్ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకున్నాయని టాక్. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్‌గా ఉన్నాయని, మురళి శర్మ తన నటన సినిమాకు హైలెట్ అయిందని అంటున్నారు.

    విజేత సినిమాపై ఆడియన్స్ అభిప్రాయాలు

    మురళి శర్మ పెర్ఫార్మెన్స్ చాలా బావుందని, తొలి సినిమా అయినా కళ్యాణ్ దేవ్ బాగా చేశాడని, రాకేష్ శశికి మంచి ఫ్యూచర్ ఉందంటూ కొందరు ట్వీట్స్ చేశారు.

    కొందరికి తెగ నచ్చేసింది

    కొందరికి ఈ సినిమా తెగ నచ్చేసింది. ఏకంగా 3.25 రేటింగ్ ఇచ్చేశారు.

    కొందరికి అస్సలు నచ్చలేదు

    అయితే మరికొందరు మాత్రం సినిమా చాలా చెత్తగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Director Rakesh Shashi's 2018 Telugu movie Vijetha starring Kalyaan Dhev and Malavika Nair has received mixed reviews and ratings from the audience around the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X