twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అజ్ఞాతవాసి' ట్విట్టర్ రివ్యూ: 'అత్తారింటికి' కంటే పెద్ద హిట్.. కానీ?

    |

    ఇదే పవన్ చివరి సినిమానేమో అన్న బెంగతో థియేటర్లకు వెళ్తున్న అభిమానులకు 'అజ్ఞాతవాసి' ఏమాత్రం దాహం తీర్చింది?.. పవన్-త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయిందా?.. 'అజ్ఞాతవాసి' విడుదల వేళ ఇప్పుడివే ప్రశ్నలు పవన్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

    Recommended Video

    అజ్ఞాతవాసి తొలి రివ్యూ వచ్చేసింది.. పవన్ కుమ్మేశాడు..!

    మొత్తానికి పవన్ అభిమాన సంద్రం ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న అజ్ఞాతవాసి నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకన్నా ముందే విదేశాల్లో ప్రీమియర్ 'షో'లు పడటంతో సినిమా టాక్ అప్పుడే బయటకొచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసికి ప్రేక్షకుడు ట్విట్టర్‌లో ఎలాంటి తీర్పు ఇచ్చాడో ఓ లుక్కేద్దాం..

    అజ్ఞాతవాసి బొమ్మ పడింది.. రికార్డుల వేట మొదలైంది.. (లైవ్ అప్‌డేట్స్)అజ్ఞాతవాసి బొమ్మ పడింది.. రికార్డుల వేట మొదలైంది.. (లైవ్ అప్‌డేట్స్)

    పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా

    అజ్ఞాతవాసి అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్ అభిమానులకే కాదు.. ప్రతీ ఒక్కరికి ఇదో పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.

    ఇంటర్వెల్ అద్భుతం


    ఫస్టాఫ్‌లో సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. సాంగ్స్ పిక్చరైజేషన్ ఆకట్టుకుంది. సినిమాలో ప్రతీ నటుడిని త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాడు.

    'వన్ ఆఫ్ ది బెస్ట్'.

    'వన్ ఆఫ్ ది బెస్ట్'.

    సెకండాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే ఓ సీన్ టాలీవుడ్ లోనే 'వన్ ఆఫ్ ది బెస్ట్'.. ఓవరాల్‌గా సినిమా బాక్స్ ఆఫీస్ హిట్.

    ఆంధ్రా భోజనం:

    విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కల్యాణ్ కామెడీ,ఇంటర్వెల్
    సెంటిమెంట్.. అన్నీ కలగలిపి ఫస్టాఫ్ ఆంధ్రా భోజనం చేసినట్లుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 'బ్యూటిఫుల్'.

    'అత్తారింటికి దారేది' కంటే పెద్ద హిట్.

    సినిమాలో ఇంట్రో సీన్ సూపర్బ్. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. మొత్తం ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ అద్భుతంగా ఉంది.

    నటీనటుల పెర్ఫామెన్స్ తో పాటు త్రివిక్రమ్ మార్క్ రచయితను ఈ సీన్స్ లో చూడవచ్చు. ముఖ్యంగా ఆఫీస్ ఎపిసోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. మొత్తంగా 'అత్తారింటికి దారేది' కంటే పెద్ద హిట్. పక్కా బ్లాక్ బస్టర్.

    డిసప్పాయింట్:

    సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేమి లేవు. వెంకటేష్ సీన్స్ కూడా అంతే. మొత్తంగా 'అజ్ఞాతవాసి' అభిమానులను అన్నివిధాలుగా నిరాశపరిచింది.

    త్రివిక్రమ్-బ్యాడ్ వర్క్:

    ఒక ఇంటర్వెల్ సీన్, అక్కడక్కడా రెండు మూడు ఎలివేషన్స్ తప్ప పెద్దగా ఏమి లేదు. త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో ఇదో పూర్ వర్క్. స్క్రీన్ వైపు ఎవరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నట్లు అనిపించట్లేదు.హీరోయిన్ క్యారెక్టర్స్ చెత్త.స్క్రీన్ మీద పవన్ కల్యాణ్ మాత్రం బాగా కనిపించాడు. పండుగ సీజన్ కాబట్టి సినిమా గట్టెక్కవచ్చు.

    ఫ్యాన్స్‌కు పండుగ

    ఫస్టాఫ్ ఫ్యాన్స్‌కు పండుగ. డైలాగ్స్&ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. 'అత్తారంటికి దారేది' సినిమా కన్నా బాగుంది.

    రొడ్డ కొట్టుడు సినిమా..

    అజ్ఞాతవాసి.. ఓ రొడ్డ కొట్టుడు కమర్షియల్ సినిమా. పురాణాల పట్ల తనకున్న జ్ఞానాన్ని త్రివిక్రమ్ అసందర్భంగా ఉపయోగించాడు.

    English summary
    Power star Pawan Kalyan has been in news ever since his Agnyaathavaasi was officially announced. It's no news that the actor-politician enjoys a huge fan following across the globe. With the movie release date round the corner, the PK fan frenzy has hit a fever's pitch. They have put up the movie hoardings and banners across Los Angeles. This is the twitter review for the Telugu Filmibeat audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X