»   » న్యూడ్ కామెంట్స్: అభిమానికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్!

న్యూడ్ కామెంట్స్: అభిమానికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేరళ బ్యూటీ మంజిమా మోహన్ గౌతమ్ మీనన్ మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల పరిచమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇటీవల ఓ అభిమాని చేసిన న్యూడ్ కామెంట్లకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.

హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ విషయంలో సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ చిన్న డిస్క్రషన్ లో.... కొందరు కామెంట్స్ చేస్తూ హీరోయిన్ల అందచందాలు చూడటానికే కొందరు సినిమాలకు వస్తారు, న్యూడిటీ ఎంత ఎక్కువ ఉంటే సినిమాలకు అంత డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.

న్యూడిటీపై మంజిమ

న్యూడిటీపై మంజిమ

ఈ కామెంట్లపై మంజిమ మోహన్ తనదైన రీతిలో స్పందించారు. ఆడియన్స్ కేవలం హీరోయిన్ల న్యూడిటీ మాత్రమే చూడటానికి సినిమాలకు వస్తారనే అభిప్రాయం పూర్తిగా తప్పు, కథ బావుంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారని తెలిపింది.

హీరోయిన్ల గ్లామర్ వస్తువగా చూడొద్దు

హీరోయిన్ల గ్లామర్ వస్తువగా చూడొద్దు

హీరోయిన్లను కేవలం గ్లామర్ వస్తువుగా చూడొద్దు, సినిమా కథను అనుసరించే హీరోయిన్ల అందచందాల ప్రదర్శన, ఇతర అంశాలు ఉంటాయని మంజిమ మోహన్ చెప్పుకొచ్చారు. కథను అనుసరించే ఎక్స్ ఫోజింగ్, న్యూడ్ సీన్లు ఉంటాయి.... అలాంటి కథలు ఎంచుకున్నపుడు ఆయా సీన్లకు తగిన విధంగా నటించాల్సి ఉంటుందని మంజిమ మోహన్ తెలిపారు.

ఇష్టం లేకుంటే దూరం

ఇష్టం లేకుంటే దూరం

ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి, ఎలాంటి కథలు చేయాలనేది.... వారి వారి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. తాను కథ, పాత్రలు నచ్చితేనే ఏ సినిమా అయిన ఒప్పుకుంటాను, నచ్చక పోతే దూరంగా ఉంటానన్నారు.

తెలుగులో అవకాశాలు లేవు

తెలుగులో అవకాశాలు లేవు

మంజిమ మోహన్ నటించిన తొలి తెలుగు సినిమా ‘సాహసం స్వాసగా సాగిపో' చిత్రం బాక్సాఫీసు వద్ద ప్లాప్ కావడంతో ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం మంజిమ మోహన్ తమిళంలో విక్రమ్ ప్రభుకు జోడిగా ‘సత్రియన్', ఉదయనిధి స్టాలిన్ తో ‘ఇప్పాడై వెల్లుమ్' చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Kerala Beauty Manjima Mohan is very active in the social media. She will be in regular touch with her fans. In a recent interaction with the fans, she made interesting comments on the exposing of heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu