Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమితాబ్ బచ్చన్ పా చిత్రం రిజల్ట్ ఏమిటి
బిగ్ బి అమతాబ్ బచ్చన్ 13ఏళ్ల బాలుడిగా నటించిన 'పా' భాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఓపినింగ్స్ బాగానే తెచ్చుకున్న చిత్రం సోమవారం కూడా స్టడీగానే కలెక్షన్స్ ఉన్నాయి. రివ్యూలన్నీ కూడా పా సినిమా ఓ ఎమేజింగ్ ఎక్సపీరియన్స్ గా పేర్కొన్నాయి. దాంతో మల్టీఫ్లెక్స్ లు హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాయ. అలాగే అమితాబ్ లేని అమితాబ్ చిత్రంగా దీన్ని పేర్కొంటున్నారు.
గంభీరమైన గొంతు, పొడుగైన విగ్రహం ఈ చిత్రంలో మాయమవటంతో దర్శకుడు బల్కీ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. అలాగే బిజెనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పా చిత్రం పదిహేడు కోట్లు..పబ్లిసిటీతో కలపి అవటంతో రికవరటం చాలా ఈజీ అంటున్నారు. వీటికి తోడు ఈ చిత్రానికి అవార్డులు గ్యారెంటీ అని చెప్తున్నారు. అలాగే ప్యామిలీలను ఆకర్షించే చిత్రం కావటం దీనికి మరో ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు.
ఈ చిత్రంలో అమితాబ్ ప్రొజేరియా అనే వ్యాధితో బాధపడే బాలుడిగా నటించారాయన. చిన్న వయసులోనే వృద్ధులుగా కనిపించడం ఈ వ్యాధి లక్షణం. ఈ ప్రయోగాత్మక పాత్రని అమితాబ్ ఎంతో ఇష్టంగా చేశారు. ఈ చిత్రంలో విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్ అమితాబ్ తల్లిదండ్రులుగా నటించారు. "నా మొదటి కొడుకు అమితాబ్ అంటే నాకెంతో ఇష్టం' అని ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు విద్యాబాలన్ సరదాగా అనేవారు.
ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. 'పా' ప్రమోషన్ కోసం తన తల్లి (విద్యాబాలన్)తో సహా అమితాబ్ ముంబయ్‌లోని ఓ స్కూల్‌కి వెళ్లారు. సినిమాలో తను చేసిన కోతి చేష్టలన్నీ ఆ పిల్లల ముందు చేసి బిగ్ బి నవ్వించారు. ఆయనతో పాటు స్కూల్ పిల్లలు కూడా డాన్స్ చేసి సరదాగా గడిపారు. వీళ్లు ఇలా చేస్తుంటే తల్లి స్థానంలో ఉన్న విద్యాబాలన్ సున్నితంగా మందలించారు. 'పా' ప్రమోషన్ కోసం ఇలా మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేయాలను కుంటున్నారు.
ఈ చిత్రానికి అమితాబ్ ఓ నిర్మాతగా వ్యవహరించడం, ప్రయోగాత్మక సినిమా కావడంతో ప్రమోషన్ విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. 'పా' తమిళ అనువాద హక్కులను పొంది ఇళయరాజా కోలీవుడ్‌లో విడుదల చేయాలను కుంటున్నారట.