ప్రభాస్ ‘సలార్’ సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి
'బాహుబలి' తర్వాత వరుసగా పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లోనే నటిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే 'KGF' వంటి భారీ హిట్ మూవీని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు చేయబోతున్న విషయం తెలిసిందే. 'సలార్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల వెలువడింది. అంతేకాదు, హీరో లుక్‌తో కూడిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. ఐదు భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సలార్'కు సంబంధించి అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రభాస్ సినిమా కోసం అన్ని భాషల్లో నటుల ఎంపిక కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొంది. ముందుగా డిసెంబర్ 15న హైదరాబాద్‌లో ఇది ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని శేరిలింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్స్ జరపనున్నారు. అన్ని కేటగిరీల నటులను ఎంపిక చేసే ఈ ప్రాసెస్‌కు ఏజ్ లిమిట్ లేదని ప్రత్యేకంగా వెల్లడించారు.

హైదరాబాద్‌లో జరిగే ఈ ఆడిషన్స్‌లో 'ఒక నిమిషం పాటు యాక్టింగ్' చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా పాల్గొనవచ్చని ప్రకటనలో తెలియజేశారు. అయితే, వాళ్లను తెలుగు వెర్షన్ కోసమే తీసుకుంటారు. పూర్తి వివరాలకు అందులో పేర్కొన్న నెంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా, తెలుగు ఆడిషన్స్ అయిపోయిన వెంటనే.. తమిళంతో పాటు కన్నడంలో నిర్వహిస్తామని పేర్కొంది చిత్ర యూనిట్. సో.. ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమాలో నటించాలనుకున్న వారు.. ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చన్న మాట.


Click it and Unblock the Notifications











