పుష్ప 2 కోసం మార్పులు చేర్పులు. మళ్ళీ మొదలుపెట్టిన సుకుమార్.. ఈసారి గట్టిగానే!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప అనే సినిమా ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో తన సత్తా చాటిన అల్లు అర్జున్ నార్త్ లో కూడా చాల మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మొదటి భాగం ఎనలేని క్రేజ్ సంపాదించింది. ఈ నేపథ్యంలో రెండో భాగం ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ఎప్పటి నుంచే అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. అయితే ఆ మధ్య కేజీఎఫ్ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఈ రెండో భాగాన్ని కూడా పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ తో నిర్మించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని ప్రచారం జరిగింది.
కానీ ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. తాజాగా రెండో భాగానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏమిటి అంటే రెండో భాగానికి సంబంధించి జూన్ 10వ తేదీ నుంచి ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి. నిజానికి మొదటి భాగానికి కొనసాగింపు కాబట్టి మొదటి భాగంలో కనబడిన దాదాపు చాలామంది నటీనటులు రెండో భాగంలో కూడా కనిపిస్తారని అంచనాలు వచ్చాయి. కానీ రెండో భాగం మరింత కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తున్న సుకుమార్ అందులో భాగంగానే కొత్త వారిని కూడా తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి తొలుత సినిమాని ఏక భాగంగా విడుదల చేయాలని భావించారు కానీ సినిమా ప్రారంభించిన తర్వాత నిడివి అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో ఇలా లాభం లేదని భావించి రెండు భాగాలుగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

అందులో భాగంగా మొదటి భాగం రెండో భాగం మీద చాలా ఆసక్తి పెంచింది. ఇప్పుడు రెండో భాగం ఎలా ఉంటుంది అనే విషయం మీద అభిమానులు మాత్రమే కాక యావత్ భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షక లోకం కూడా ఎదురు చూస్తోంది. మొదటి భాగంలో మెయిన్ విలన్ గా సునీల్ కనిపించగా రెండో భాగంలో మెయిన్ విలన్ గా ఫహాద్ ఫాజిల్ కనిపిస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు బలంగా ఉండేలా ఒక రేంజ్ లో సుకుమార్ రాసుకున్నాడు అని తెలుస్తోంది. స్క్రిప్ట్ మార్పులు చేర్పులు చేయడంతో బిజీబిజీగా గడిపిన సుకుమార్ ఇప్పుడు ఆ మార్పులకు తగినట్లు కొత్త నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు.


Click it and Unblock the Notifications











