కూతుర్లే సుప్రీమ్, తేల్చి చెప్పిన మెగాస్టార్
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొడుకుల కంటే కూతుర్లే స్పెషల్ అని పేర్కొన్నారు. అంతే కాదు....కుటుంబం మొత్తానికి వారు ఆత్మలాంటి వారు అని ప్రశంసించారు. కుటుంబ సంబంధ విషయాల్లో వారి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. కూతుర్లు కుటుంబానికి సుప్రీం లాంటి వారు అని పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే....
ప్రస్తుతం అమితాబ్ మూడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఆర్ బాల్కీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న చిత్రం ‘షమితాబ్'. అమితాబ్ బచ్చన్, ధనుష్, అక్షర హాసన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అమితాబ్ నటిస్తున్న మరో చిత్రం ‘పికు'. ఈ చిత్రానికి సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. రోన్నిలహిరి నిర్మాత. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ రెండు చిత్రాలతో పాటు అమితాబ్ బచ్చన్ ‘వాజిర్' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. బిజయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, అదిథి రావు హైదరి ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











