ఆగస్టులో సినిమాల పండగే.... ఏయే సినిమాలు, ఎప్పుడు వస్తున్నాయంటే?

By Bojja Kumar

Recommended Video

Bollywood and Tollywood upcoming Movies In August

సినిమా లవర్స్‌కు శుభవార్త వార్త... ఎందుకంటే ఆగస్టులో మీరు వారానికి రెండు సినిమాలు చూసినా తరగని సినిమాలు విడుదలవుతున్నాయి. మీకు తీరిక ఉంటే డే బై డే ఒక సినిమా కుమ్మేయొచ్చు. తెలుగు, హిందీలో కలిపి దాదాపు 15 సినిమాలు ఈ నెలలో విడుదలువుతున్నాయి. ఇందులో అర్జున్‌రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ నటించిన 'గీతా గోవిందం', దిల్ రాజు బేనర్ నుండి నితిన్-రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన 'శ్రీనివాస కళ్యాణం', నాగ చైతన్య నటించిన 'శైలాజా రెడ్డి' అల్లుడు', హిందీలో ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్ నటించిన 'ఫన్నేఖాన్', అక్షయ్ కుమార్ మూవీ 'గోల్డ్', కమల్ హాసన్ విశ్వరూపం 2 లాంటి సినిమాలు ఉన్నాయి.

తొలి వారం 4 తెలుగు సినిమాలు

తొలి వారం 4 తెలుగు సినిమాలు

ఆగస్ట్ ఫస్ట్ వీక్ (ఆగస్టు 3) తెలుగులో సుశాంత్ నటించిన ‘చిలసౌ' మూవీతో పాటు, అడవిశేష్ నటించిన ‘గూఢచారి', మారుతి కథ అందించిన ‘బ్రాండ్ బాబు', ‘తరువాత ఎవరు' లాంటి సినిమాలు విడుదలవుతున్నాయి.

ఆగస్టు 9న ‘శ్రీనివాస కళ్యాణం'

ఆగస్టు 9న ‘శ్రీనివాస కళ్యాణం'

దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్-రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణ్' ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆగస్టు 15న ‘గీతా గోవిందం'

ఆగస్టు 15న ‘గీతా గోవిందం'

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతా గోవిందం' మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నెలాఖరున వస్తున్న నాగ చైతన్య

నెలాఖరున వస్తున్న నాగ చైతన్య

ఈ నెలాఖరున అంటే ఆగస్టు 31న నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు' చిత్రం విడుదల కాబోతోంది.

ఐశ్వర్యరాయ్, తాప్సీ, ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు

ఐశ్వర్యరాయ్, తాప్సీ, ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు

ఆగస్టు 3న ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన ‘ఫన్నేఖాన్' విడుదల కాబోతోంది. దీంతో పాటు ఇర్ఫాన్ ఖాన్, దుల్కర్ సల్మాన్ మూవీ ‘కార్వాన్', తాప్సీ నటించిన ‘ముల్క్' ఇదే రోజున విడుదలవుతున్నాయి.

ఆగస్టు 10న విశ్వరూపం 2

ఆగస్టు 10న విశ్వరూపం 2

కమల్ హాసన్ మూవీ ‘విశ్వరూపం 2' ఆగస్టు 10న తెలుగు, హిందీ, తమిళంలో విడుదల కాబోతోంది. విశ్వరూపం తొలి పార్ట్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆగస్టు 15న అక్షయ్ కుమార్ ‘గోల్డ్'

ఆగస్టు 15న అక్షయ్ కుమార్ ‘గోల్డ్'

అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్' మూవీ ఆగస్టు 15న విడుదలకు సిద్దమవుతోంది. ఇండియన్ హాకీ టీమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కోచ్ తపన్ దాస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించిన పోలీస్ డ్రామా ‘సత్యమేవ జయతే' మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X