బాహుబలి ప్రభాస్‌కి పోటీగా డేవిడ్ వార్నర్.. ఏం చేస్తున్నాడో తెలుసా?
కేవలం క్రికెట్ అభిమానులనే కాకుండా అన్ని వర్గాల సినిమా ప్రేక్షకులను తన టిక్ టాక్ విడియోలతో ఎట్రాక్ట్ చేస్తున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ సారి ఐపీఎల్ ద్వారా చూడాల్సిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ని మిస్ అయ్యాము అనే బాధను మర్చిపోయేలా చేస్తున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్ ఆడియెన్స్ ని వార్నర్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు.
మహేష్ బాబు పండు గాడు డైలాగ్ నుంచి బుట్ట బొమ్మ సాంగ్ వరకు ప్రతి ఒక్క అంశంతో వార్నర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఇక మెయిన్ గా ఈ స్టార్ క్రికెటర్ బాహుబలి ప్రభాస్ ని టార్గెట్ చేస్తుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్న మహేంద్ర బాహుబలి అంటూ డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తన కాస్ట్యూమ్ ని అలాగే బాహుబలిలో ప్రభాస్ కాస్ట్యూమ్ ని పక్క పక్కనే ఫొటోలో జోడించిన వార్నర్ ఇద్దరిలో ఎవరి కాస్ట్యూమ్ ప్రిఫెర్ చేస్తారు అని ప్రశ్నించాడు. దీంతో నెటీజన్స్ ఎవరి స్టయిల్లో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కొందరు వార్నర్ కి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు బాహుబలిని నువ్వు మించలేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరదాగా వార్నర్ ఇలా నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుండగా అభిమానులు మాత్రం సీరియస్ గా తీసుకొని కామెంట్ బాక్స్ ని నింపేస్తున్నారు.


Click it and Unblock the Notifications











