twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా పై 50 లక్షలకి దావా వేసిన ఆటో డ్రైవర్: రాజా ది గ్రేట్ తరహాలోనే....

    |

    ఈ మధ్య టాలీవుడ్ లో విడుదలైన "రాజా ది గ్రేట్" సినిమాలో ఒక ఫోన్ నెంబర్ కారణంగా అసలు సినిమాతో ఏ సంబందం లేని వ్యక్తి ఒక రకమైన టార్చర్ అనుభవించానంటూ, దర్శకుడు అనీల్ రావిపూడి మీద కేసు వేస్తానని, ఆయన తన సినిమాలో చెప్పిన ఫోన్ నెంబర్ కారణం గా తనకు మనశ్శాంతి కరవైందంటూ బహిరంగ లేఖలో వాపోయిన విషయం గుర్తుందా?

    Recommended Video

    Ravi Teja's 'Raja the Great' First look Poster
    రాజా ది గ్రేట్

    రాజా ది గ్రేట్

    రాజా ది గ్రేట్ సినిమాలో ఒక సన్నివేశం లో నాకొడుకు ఫోన్ నంబర్ ఇదే అంటూ చెప్పిన ఫోన్ నెంబర్ని నిజంగా రవితేజా నంబర్ అనుకొని కొన్ని వేలమంది కాల్ చేయటం తో ఆ నంబర్ వడుతున్న ఒక కార్పెంటర్ చాలా ఇబ్బంది పడ్డాడట.... సరిగ్గా ఇప్పుడు ఇంకో ఆటో డ్రైవర్ కూడా అలాగే బలయ్యాడు.. ఇంకాం దారుణం ఏమిటంటే ఆ ఫోన్ నంబర్ వల్ల అతని భార్య విడాకుల వరకూ వెళ్లటం తో అతని బాధ వర్ణనాతీతం...

    రాజ్‌నీతీ

    రాజ్‌నీతీ

    ఆ వివరాలిలా ఉన్నాయి.. బంగ్లా దేశ్ సినీ నటుడు షాకిబ్ ఖాన్ ఈ మధ్యే తానే హీరోగా, నిర్మాతగా ఒక రాజ్ నీతీ అనే సినిమా నిర్మించాడు. లోబడ్జెట్ లో తీసినా అనూహ్యవిజయాన్ని సొంతం చేసుకుందీ సినిమా షాకీబ్ ఫాలోయింగ్ కూడా ఇంతకుముందుకంటే రెండింతలు పెరిగింది ఈ విజయంతో.

     ఏమాత్రం సంబంధం లేని ఒక ఆటో డ్రైవర్

    ఏమాత్రం సంబంధం లేని ఒక ఆటో డ్రైవర్

    ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా వల్ల అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక ఆటో డ్రైవర్ జీవితం చిన్నాభిన్నం అయ్యే ప్రమదం వచ్చి పడింది. ఇంతకీ ఆ సినిమాకీ ఈ ఆటో డ్రైవర్ ఇజాజుల్ మియా కీ సంబంధం లేదు కానీ.. ఈ మూవీలోని ఒక సీన్లో భాగంగా ఓసారి హీరో షాకిబ్ తన గర్ల్ ఫ్రెండ్ కు ఓ నెంబర్ ఇస్తాడు.

     మనశ్శాంతి కరువైందీ

    మనశ్శాంతి కరువైందీ

    అంతే ఇక ఆ నంబర్ నిజంగా హీరో గారిదేఅనుకున్న ఆడపిల్లలంతా ఆ నంబర్‌కి డయల్ చేయటం మొదలు పెట్టారట. రాజ్ నీతి విడుదలైనప్పటినుంచీ తనకు మనశ్శాంతి కరువైందంటున్నాడు ఇజాజుల్ మియా. తన ఫోన్ నెంబర్ ను రాజ్ నీతిలో హీరో షాకిబ్ చెప్పగా, అది చూసిన షాకిబ్ మహిళా అభిమానులు కాల్ చేసి లవ్ ప్రపోజ్ చేస్తున్నారట.

     ఓ రెండు నిమిషాలు మాట్లాడాలీ

    ఓ రెండు నిమిషాలు మాట్లాడాలీ

    అమ్మాయిల కాల్స్ రావటం మామూలుగా అయితే బాగానే ఉంటుందేమో గానీ ఒక సామాన్యుడైన ఇజాజుల్ కి మాత్రం అది పెద్ద తలనొప్పి వ్యవహారం అయ్యింది. హల్లో షాకిబ్.. ఓ రెండు నిమిషాలు మాట్లాడాలంటూ యువతులు ఫోన్ చేస్తుండటాన్ని గమనించిన తన భార్య మోసగాడిగా భావిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

    కొద్దికాలం కిందటే వివాహం అయింది

    కొద్దికాలం కిందటే వివాహం అయింది

    ప్రతిరోజు వందకు పైగా కాల్స్ రావడంతో భార్య కు ఓపిక నశించి, తనపై నమ్మకాన్ని కోల్పోయి.. చివరికి తనకు విడాకులు ఇవ్వాలని కోరినట్లు చెప్పాడు. తనకు కొద్దికాలం కిందటే వివాహం అయిందని, ఓ పాప ఉందన్నాడు. కానీ ఇతర మహిళలు, యువతులతో తనకు సంబంధం ఉందని భార్య అనుమానిస్తుందని, అందుకు మూవీలో తన ఫోన్ ఫోన్ నెంబర్ వాడకమే కారణమంటున్నాడు.

    500 కిలోమీటర్ల దూరం నుంచి

    500 కిలోమీటర్ల దూరం నుంచి

    ఫోన్ నెంబర్ లోకేషన్ గుర్తించిన ఓ యువతి 500 కిలోమీటర్ల దూరం నుంచి షాకిబ్ ఖాన్ అనుకుని తనను కలవడానికి వచ్చినట్లు తెలిపాడు. ఈ తతంగానికి కారణమైన ఆ సినిమా నటుడు, నిర్మాత షాకిబ్ పై తన క్లయింట్ 50 లక్షల టాకాలు (భారత కరెన్సీలో దాదాపు 40 లక్షలు) నష్టపరిహారం కోరుతూ దావా వేసినట్లు లాయర్ మాజిద్ తెలిపారు. జిల్లా కోర్టు జడ్జి విచారణ చేపట్టాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

    English summary
    Ijajul Mia told he had received hundreds of calls every day since the release in June of "Rajniti", in which the country's top movie star Shakib Khan is seen giving the number to his girlfriend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X