»   » ‘ఆటో జానీ’ టైటిల్ చిరు 150వ సినిమా కోసమే, కానీ...

‘ఆటో జానీ’ టైటిల్ చిరు 150వ సినిమా కోసమే, కానీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అతను డైరెక్టర్ కాక ముందు చిరంజీవి సినిమా విడుదలైందంటే చాలు తన స్నేహితులతో కలిసి థియేటర్లను డెకోరేట్ చేస్తూ...బ్యానర్లు కడుతూ హంగామా చేసేవాడు. అప్పటి జ్ఞాపకాలను పూరి అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.

త్వరలో చిరంజీవి 150వ సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో దర్శకత్వం వహించే ఛాన్స్ తనకు దక్కాలని తాపత్రయ పడుతున్నారు పూరి జగన్నాథ్. ఈ విషయమై పూరి మాట్లాడుతూ.. చిరు కోసం ‘ఆటో జాని' టైటిల్ రిజిస్టర్ చేయించాను. ఇంకా స్టొరీ, స్క్రిప్ట్ రెడీ కాలేదు. ఈ టైటిల్ విన్న తర్వాత కథేంటి అని ఎవరు అడగరు. చిరంజీవి గారి ఫోన్ కోసం వెయిటింగ్. అని అన్నారు.

చిరంజీవి 150వ సినిమా విషయమై గతంలో తన అనుభవాల గురించి వెల్లడిస్తూ...‘బుడ్డా హోగా తెరా బాప్' సినిమాకు సంబందించిన ఓ ఈవెంటులో అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారిని మళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రపోజ్ చేసారు. 150వ సినిమాకు నన్ను డైరెక్టరుగా రికమండ్ చేసారు. నేను డైరెక్టక్షన్ చేస్తే ఆయన గెస్ట్ రోల్ చేస్తానని కూడా చెప్పారు' అని తెలిపారు.

'Auto Jaani' title registered for Chiranjeevi's 150th Movie

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉండటం అభిమానులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆయన పూర్తిగా రాజకీయాలను విడిచి పెట్టి సినిమాల్లో కంటిన్యూ కావాలని మెగా అభిమానులంతా కోరుకుంటున్నారు. వీలైనంత త్వరగా 150వ సినిమా మొదలు పెట్టాలని, ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేయాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభిమానులు కోరుకున్నట్లుగా చిరంజీవిలో మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది. 150వ సినిమాకు సన్నద్ధం కావడంతో భాగంగా ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సదస్సుకు డుమ్మా కొట్టడమే ఇందుకు నిదర్శనం.

నిమా షూటింగు మొదలవ్వాలంటే చిరంజీవి తన ఫిజిక్‌ను పాత్రకు తగిన విధంగా సిద్దం చేసుకోవాలి. డాన్సులు, ఫైట్లు చేయాలి కాబట్టి కాస్త ఫిట్ నెస్ కూడా అవసరమే. అందుకే షూటింగు మొదలవ్వడానికి ముందే చిరంజీవి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాస్త గ్లామర్ గా కనిపించడానికి ఇక్కడ ఆయన పలు రకాల ఆయుర్వేద మసాజులు చేయించుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ అనే విషయం తేలింది కానీ డైరెక్టర్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి.

English summary
Director Puri Jagannath who is one of the strong contenders to wield the megaphone for Chiranjeevi's 150th Movie already registered the title 'Auto Jaani'.
Please Wait while comments are loading...