అనుష్కతో నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్!
హైదరాబాద్: హీరోయిన్ అనుష్కకు అక్కినేని స్టార్స్ అయిన నాగార్జున, నాగ చైతన్యకు లింకు పెడుతూ గతంలో చాలా పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యకు యోగా గురువు అయిన అనుష్క, నాగార్జున 'సూపర్' సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. నాగార్జునతో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించింది.
అక్కినేని కుటుంబానికి అనుష్క క్లోజ్‌గా ఉంటుండటంతో.....నాగార్జునతో అనుష్క ఎఫైర్ నడుపుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ మధ్య ఓ ప్రముఖ దిన పత్రికలో నాగచైతన్య, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త రావడం పెనుసంచలనమే సృష్టించింది. అయితే అవన్నీ కేవలం కల్పితాలే అని ఆ తర్వాత తేలిందనుకోండి.
ఆ పుకార్ల సంగతి పక్కన పెడితే...తాజాగా అనుష్క, నాగ చైతన్య సంబంధించిన ఓ విషయం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ నెల 23న నాగ చైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని చైతు నటించి 'ఆటో నగర్ సూర్య' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.
అనుష్క నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'వర్ణ' ఈ నెల 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వర్ణ చిత్రం ప్రదర్శితం అయ్యే థియేటర్లలో 'ఆటో నగర్ సూర్య' థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శించనున్నట్లు సమాచారం. సో....అనుష్క సినిమాతో పాటు నాగ చైతన్య బర్త్ ట్రీట్‌గా విడుదల కాబోతున్న ట్రైలర్‌ను ఓకే స్క్రీన్‌పై ప్రేక్షకులు చూడబోతున్నారన్నమాట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications












