For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆటో నగర్ సూర్య’ ఫస్ట్ లుక్ ఇదే...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో నాగచైతన్య నటిస్తున్న 'ఆటో నగర్ సూర్య' ఒకటి. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. రేపు(నవంబర్ 23) నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

    దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్. వినోదం, యాక్షన్‌ అంశాలతో మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెట్టబోతున్నాడు దర్శకుడు దేవా కట్ట. ఆటోనగర్‌ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం.

    ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు 'ఆటోనగర్‌ సూర్య' చిత్రంలో చూపించబోతున్నారు.

    'ఆటో నగర్‌ సూర్య' సినిమాలో రంభ ఐటం సాంగ్‌ ఉంటే బాగుంటుందని భావించారట. దర్శక,నిర్మాతలు పదే పదే కోరడంతో ఆమె ఈ ఐటం సాంగ్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

    English summary
    Naga Chaitanya starrer Auto Nagar Surya 1st Look Poster has been released. Autonagar Surya is being directed by Devakatta and produced by K.Achi Reddy under the banner of Max India Productions while R.R.Movie Makers will present the film. Anoop Rubens is the music director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X