నాగ చైతన్య మెకానిక్ గా...
హైదరాబాద్: సూర్య.. విజయవాడ ఆటోనగర్‌లో చేయితిరిగిన మెకానిక్. అతడు అనాథ కానీ..అనామకుడు కాదు. అతడి ప్రపంచంలో మాటకు మాట...దెబ్బకు దెబ్బే సమాధానం. అలాంటి యువకుడు ఓ పవర్‌ఫుల్ రాజకీయనాయకుడితో ఢీ కొంటే ఎలాంటి పరిణామాలు సంభవించాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు దేవాకట్టా. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'ఆటోనగర్ సూర్య'. నాగచైతన్య, సమంతా జంటగా నటిస్తున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్‌ఇండియా పతాకంపై కె. అచ్చిడ్డి నిర్మిస్తున్నారు.
మరో 20 శాతం చిత్రీకరణ మిగిలి ఉండగా ఈ సినిమా ఆగిపోయింది. దాదాపు యేడాది పాటు... ఈ సినిమాని ఎవరూ ముందుకు కదల్చలేదు. 'తడాఖా' హిట్ తరవాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. చిత్రం ఆడియో నవంబర్ 30న విడుదల చేస్తారు.

సమాజంలో నాలుగే జాతులు ఉన్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాళ్లు, కనీసం తిన్నంత పండించుకునేవాళ్లు, పండించలేక అడుక్కుతినేవాళ్లు ఉన్నారు. ఈ ముగ్గుర్ని దోచుకుతినే నాలుగో జాతి కూడా ఉంది. అదే లోఫర్ జాతి. అలాంటి వాళ్లమీదే 'సూర్య' ప్రతాపం చూపిస్తాడు అంటున్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఆటోనగర్ సూర్య'. సమంత కథానాయిక. దేవాకట్టా దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు.
నాగచైతన్య, కిమాయాలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతంతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. ''ప్రస్తుత సమాజ పరిస్థితులపై ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలోని సంభాషణలకు మంచి స్పందన వస్తోంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తామని'' చిత్రబృందం తెలిపింది. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్‌నారాయణ, రఘుబాబు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, కళ: రవీందర్.


Click it and Unblock the Notifications











