నాగ చైతన్య బర్త్ గిఫ్ట్‌గా...ఫస్ట్ లుక్
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున వారసుడిగా హీరోగా పరిచయమై రాణిస్తున్న నాగ చైతన్య రేపటితో(నవంబర్ 23) 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా రెండు విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి. చైతన్య తండ్రి నటించిన 'ఢమరుకం' చిత్రం రేపు విడుదలవ్వడంతో పాటు, నాగ చైతన్య నటిస్తున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
దడ, బెజవాడ ప్లాపు కావడంతో హిట్ కోసం పరితపిస్తున్న అక్కినేని యువ హీరో నాగచైతన్య మళ్లీ పరిశ్రమలో తన సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. 'ఆటో నగర్ సూర్య' చిత్రానికి దేవా కట్ట దర్శకత్వం వహిస్తుండగా హాట్ లేడీ సమంత హీరోయిన్‌గా రెండోసారి నాగచైతన్యతో రొమాన్స్ చేస్తోంది.
ఈ చిత్రంలో నాగ చైతన్య మాస్ హీరోగా కనిపించ బోతున్నారు. బెజవాడ చిత్రం ద్వారా మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశ పడ్డ చైతన్యకు ఆ సినిమా ప్లాపు కావడంతో కుదరలేదు. ఈ చిత్రంలోనై మాస్ అండ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు.
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.
మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











