పెద్దలకు మాత్రమే అని తేల్చారు
హైదరాబాద్ : ఇప్పుడందరి దృష్టీ జూన్ 27న విడుదల కానున్న ఆటోనగర్ సూర్య చిత్రం పై ఉంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తైంది. A(పెద్దలకు మాత్రమే) సర్టిఫేకేట్ వచ్చింది.రెండు గంటల 37 నిముషాలు..టైటిల్స్ తో కలిపి ఉండనుంది. నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'.
దర్శకుడు మాట్లాడుతూ ''పొలిటికల్ థ్రిల్లర్ తరహాలో సాగే కథ ఇది. కథనానికి ప్రాధాన్యముంది. నాగచైతన్య, సమంత జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. వీరి పాత్రలను కొత్త తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నం చేశాము'' అన్నారు.
ఆ చిత్రంలో నాగచైతన్య టైటిల్ రోల్ లో సూర్య పాత్రలో కనపించనున్నారు. సూర్యకి అమ్మానాన్నా అన్నీ ఆటోనగరే. అనవసరంగా ఆ ప్రాంతం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టడు. నిఖార్సయిన ఆ అబ్బాయి మనసు తెలుసుకొని ఓ అందాల భామ సూర్యకి దగ్గరైంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? వీరి ప్రేమకథ ఎక్కడిదాకా చేరింది? తదితర విషయాల్ని తెరపైనే చూడాలంటున్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి.

ఆ చిత్రంలో తన పాత్ర గురించి నాగ చైతన్య మాట్లాడుతూ... 'సూర్య... ఆటోనగర్‌లో అతని పేరు తెలియని వారుండరు. మంచివాళ్లకు ఉషోదయపు సూర్యుడే. తన ఉనికిని ఇష్టపడని వాళ్ల ముందు భగభగ మండుతాడు. ఈ లక్షణాలు చూసే ఓ అందాల భామ అతనికి మనసిచ్చింది. వారిద్దరి ప్రేమ కథకు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే' అంన్నారు నాగచైతన్య. సమంత హీరోయిన్ గా చేస్తున్ ఈ చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.
వినోదం, యాక్షన్ అంశాలతో మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెట్టబోతున్నాడు దర్శకుడు దేవా కట్ట. ఆటోనగర్ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'ఆటోనగర్ సూర్య'లో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు. మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.


Click it and Unblock the Notifications











