‘ఆటో నగర్ సూర్య’ లేటెస్ట్ డీటేల్స్
దడ, బెజవాడ ప్లాపు కావడంతో హిట్ కోసం పరితపిస్తున్న అక్కినేని యువ హీరో నాగచైతన్య మళ్లీ పరిశ్రమలో తన సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్' సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. హాల్ లేడీ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రం స్టాటస్ విషయానికొస్తే....ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు జరుగుతోంది. షూటింగ్ దాదాపుగా 80% పూర్తయింది. ఈ చిత్రంలో నాగ చైతన్య మాస్ హీరోగా కనిపించ బోతున్నారు. బెజవాడ చిత్రం ద్వారా మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశ పడ్డ చైతన్యకు ఆ సినిమా ప్లాపు కావడంతో కుదరలేదు. ఈ చిత్రంలోనై మాస్ అండ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు.
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.
మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











