‘ఆటోనగర్ సూర్య’ టాక్...ఆ రేంజిలో లేదంటున్నారు!

By Bojja Kumar

హైదరాబాద్: నాగచైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ఆటోనగర్ సూర్య. మాక్స్ ఇండియా పతాకంపై ఆచ్చిరెడ్డి నిర్మించారు. దేవా కట్టా దర్శకత్వం వహించారు. చాలా కాలంగా విడుదల సమస్యలు ఎదుర్కొని వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకులముందుకు వచ్చింది.

ఇప్పటి వరకు లవ్ బాయ్ పాత్రల్లో కనిపించిన నాగ చైతన్యలోని మాస్ కోణాన్ని ఆవిష్కరించే చిత్రమని.... నాగార్జునకు 'శివ' ఎలానో, నాగ చైతన్య 'ఆటో నగర్ సూర్య' అలా అవుతుందని, గీతాంజలి వంటి క్లాసిక్ తర్వాత నాగార్జునకు శివ ఎలాంటి గుర్తింపును తీసుకొచ్చిందో, మనం తర్వాత నాగచైతన్యకు ఆటో నగర్ సూర్య అలాంటి పేరును తెచ్చిపెడుతుంది అంటూ నిర్మాతలు, దర్శకుడు ఊదర గొట్టారు.

Autonagar Surya public talk

అయితే తాజాగా విడుదలైన ఈ చిత్రం టాక్ మాత్రం ఆ రేంజిలో లేదని సగటు ప్రేక్షకుల నుండి వెలువడుతున్న అభిప్రాయం. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు యావరేజ్‌గా ఉందని అంటున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి విశ్లేషణ మరికాసేపట్లో మీ ముందుకు తేబోతున్నాం.

ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత, సాయికుమార్‌, కిమాయా, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, దువ్వాసి మోహన్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. బ్యానర్: మ్యాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా. నిర్మాత: కె.అచ్చిరెడ్డి సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X