twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆటో నగర్ సూర్య’ లేటెస్ట్ న్యూస్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేమకావాలి, పూలరంగడు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కె.అచ్చిరెడ్డి తాజాగా 'ఏమాయ చేసావె' జంట నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా 'వెన్నెల', 'ప్రస్తానం' లాంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన దేవా కట్ట దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఆటో నగర్ సూర్య' షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటోంది.

    ఈ చిత్రం గురించి మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ..'ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రీ-రికార్డింగుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అనూప్ ఎక్సలెంట్‌గా రీ-రికార్డింగ్ చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తాము' అన్నారు.

    Autonagar Surya in re-recording

    ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్ర క్లాస్‌ని, మాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, నాగ చైతన్య-సమంత కాంబినేషన్లో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ 'ఆటో నగర్ సూర్య', మా మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్‌కి ఇది హాట్రిక్ మూవీ అవుతుందని నిర్మాత అచ్చిరెడ్డి చెప్పుకొచ్చారు.

    ఈ చిత్రంలో కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్ వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, మధు, పృథ్వీ, సమ్మెట గాంధీ, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్: రవీందర్.

    English summary
    
 Naga Chaitanya and Samantha starrer 'Autonagar Surya' re-recording is currently going on and Anoop Rubens is handling this work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X