'ఆటోనగర్ సూర్య' రిలీజ్ డేట్ మళ్లీ మారింది
హైదరాబాద్: నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం 'ఆటోనగర్ సూర్య' రిలీజ్ ఎప్పుడా అని అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ తేదీ మళ్లీ మారింది. ఈ నెలాఖురన అంటే 31 న విడుదల అవుతుందని ప్రకటించిన ఈ చిత్రం పిభ్రవరి 7న విడుదల వాయిదా పడిందని సమాచారం. ఈ నెల 19న పాటల్ని విడుదల చేస్తున్నారు. సమంత హీరోయిన్. దేవా కట్టా దర్శకుడు. అచ్చిరెడ్డి నిర్మాత.
దేవకట్టా మాట్లాడుతూ...సమాజంలో జరిగే చెడుని రూపుమాపడమే సూర్య లక్ష్యం. దీనికోసం ఆ చెడుకి కారణమైన వారిని వేటాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వాళ్లని సమాజానికి దూరం చేస్తేనే చెడుని అంతం చెయ్యొచ్చనేది అతడి ఆలోచన. ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాలేమిటి అనేది తెరపైనే చూడాలంటున్నారు దేవాకట్టా.

నిర్మాత మాట్లాడుతూ ''నాగచైతన్యని యువ నాయకుడిగా చూపించబోతున్నాం. సమాజానికి మంచి చేయాలనుకుంటే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేదే సినిమా ప్రధానాంశం. అనూస్ అందించిన స్వరాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి'' అన్నారు.
'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.


Click it and Unblock the Notifications











