రామ్ చరణ్ ‘ఎవడు’తో పాటు నాగ చైతన్య ఆటో...

By Bojja Kumar

హైదరాబాద్: నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. సమంత హీరోయిన్. దేవా కట్టా దర్శకుడు. అచ్చిరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఆడియోని జనవరి 19న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. కాగా ఈచిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను 'ఎవడు' సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

ఈ విషయమై దర్శకుడు దేవా కట్ట తన ట్విట్టర్లో ట్వీట్ చేసాడు. 'ఎవడు' సినిమాతో పాటు 'ఆటో నగర్ సూర్య' ట్రైలర్ వస్తోంది. అన్ని UFO, PXD స్క్రీన్లలో ఇది ప్రదర్శితం అవుతుంది. CUBE సిస్టమ్ ఉన్న థియేటర్లలో మాత్రం ఈ ట్రైలర్ ప్రదర్శించడం లేదు అని దేవాకట్ట వెల్లడించారు.

ఇక ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడా అని అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో ఫైనాన్సియల్ సమస్యలతో ఆగి మళ్లీ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అచ్చిరెడ్డి ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

నిర్మాత మాట్లాడుతూ ''నాగచైతన్య పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అనూప్‌ చక్కటి స్వరాలందించారు. పాటల్ని త్వరలో విడుదల చేస్తాం''అన్నారు. "ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నాం. నాగచైతన్య కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్టవుతుంది. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ చాలా చక్కని స్వరాలు కూర్చారు.' అని తెలిపారు.

'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X