సినిమా బాగోలేదనే టాక్ వచ్చిందంటే ముందుగా దర్శక,నిర్మాతలు చేసే పని సినిమాని ట్రిమ్ చేయటం. తాజాగా మొన్న శుక్రవారం రిలీజయిన ఆవకాయ బిర్యాని ఆ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. ఓ పది నిముషాలు పాటు సినిమాను నిర్మాత శేఖర్ కమ్ముల,దర్శకుడు అనీష్ కురువెళ్ళ కట్ చేసారు. క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్ ని పూర్తిగా తీసేసారు.ఇలా చేయటం వల్ల ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని వారు చెప్తున్నారు. ఛ...నిజంగానా అనిపించినా ఏదో రకంగా సినిమా నిలబెట్టాలనే తాపత్రయంతో సినిమా పబ్లిసిటిని కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. హిందు...ముస్లిం లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విషయం తక్కువై..సోది ఎక్కువ అవటం సహనాన్ని పరీక్షిస్తోందని సామాన్య ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ ట్రిమ్మింగ్ హిట్టుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే.