»   » నేను ప్రధాని మోడీ కూతుర్ని.... హాట్ బ్యూటీ కామెంట్

నేను ప్రధాని మోడీ కూతుర్ని.... హాట్ బ్యూటీ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: క్యాలెండర్ గర్ల్స్ సినిమాతో బాలీవుడ్ లో నటిగా తెరంగ్రేటం చేస్తున్న హాట్ మోడల్ అవనీ మోడీ ఇటీవల ప్రెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రధాని నరేంద్ర మోదీ మీకు బంధువా అని ఓ ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించగా 'అవును, నేను నరేంద్ర మోదీ కూతుర్ని' అంటూ సమాధానం ఇచ్చింది.

'నేనే కాదు దేశంలోని ఆడపిల్లలందరూ మోదీసాబ్ కూతుళ్లే. అందరికీ ఆయన తండ్రిలాంటి వారు. ఆయన నికార్సైన నాయకుడు, స్ఫూర్తిప్రదాత' అంటూ పొగిడేసింది. అవని సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో మోదీకి ఆమె ఎమైనా బంధువు అవుతుందా అనే సందేహం కలిగింది. అయితే మోదీకి తాను బంధువును కాదని పరోక్షంగా వెల్లడించింది.

అవనీ మోడీ నటిస్తున్న క్యాలెండర్ గర్ల్స్ సినిమా విషయానికొస్తే... మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో క్యాలెండర్ గర్ల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది చూపించబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 25న విడుదలవుతున్న ఈ సినిమాపై అంనాలు భారీగానే ఉన్నాయి.

Avani Modi goes from bold to conventional in 'Calendar Girls'

నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తీయడం బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ స్టైల్. బార్ గర్ల్స్ జీవితంపై 'చాందినీ బార్', మోడలింగ్ రంగంలోని మోడల్స్‌పై 'ఫ్యాషన్', కథానాయికల జీవితంపై 'హీరోయిన్' లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తాజాగా ఆయన క్యాలెండర్ గర్ల్స్‌ జీవితం ఎలా ఉంటుదనే విషయంపై సినిమా తెరకెక్కిస్తున్నారు.

ప్రతి సంవత్సరం బికినీ భామలతో రూపొందించే క్యాలెండర్స్‌కు గ్లామర్‌ ప్రపంచంలో మంచి పేరుంది. స్విమ్‌ సూట్‌ అందగత్తెలతో మలిచే ‘కింగ్ ఫిషర్' క్యాలెండర్‌ లాంటి వాటి ద్వారా విజయ్ మాల్యా లాంటి వారు తన వ్యాపారానికి ప్రచారం చేసుకోవడం తెలిసిందే. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌పై మెరిసిన తరువాతే దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌ వంటి హీరోయిన్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

హాట్ అండ్ సెక్సీగా నవ్వులు చిందిస్తూ క్యాలెండర్లపై కనిపించే అమ్మాయిల జీవితం ఎలా ఉంటుంది అనే విషయం ఈ సినిమాలో ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో ఆకాంక్ష పూరి, అవని మోడి, కైరా దత్, రుహి సింగ్, సటారుప పైనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరంతా ఇప్పటికే మోడలింగ్ రంగంలో రాణిస్తున్నా భామలు. హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో బికినీలకు పర్‌పెక్టుగా సూటయ్యే, ఫ్యాషనబుల్ బాడీ ఉన్న ఈ ఐదుగురు అమ్మాయిలను దర్శకుడు మధుర్ బండార్కర్ ఏరి కోరి ఎంపిక చేసారు.

English summary
Avani Modi, who makes her debut in Calendar Girls, was initially surprised when she learnt that she'd be playing a Pakistani girl who aspires to become a supermodel in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu