»   » సినిమా ప్లాప్ అవుతుందనే భయంతో నిర్మాత ఆత్మహత్య

సినిమా ప్లాప్ అవుతుందనే భయంతో నిర్మాత ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీగా డబ్బలు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమా...ప్లాప్ అవుతుందనే భయంతో తీవ్రమైన మనోవేదనకు గురైన ఓ నిర్మాత ఒత్తిడి భరించలేక చిరవకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మళయాల సినీ పరిశ్రమలో విషాదన సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన నిర్మాత పేరు అజయ్ కృష్ణన్.

తిరుముళ్ళవరానికి చెందిన అజయ్ కృష్ణన్ (29) 'అవరుడే రవుకల్' అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ చిత్రం ప్రివ్యూను కొచ్చిలో రెండు రోజుల క్రితం చూశారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తేల్చారు.

Avarude Ravukal producer commits suicide

సినిమా విడుదలైనా ఆడే పరిస్థితి ఉండదనే మనో వేదనకు గురయ్యాడు అజయ్ కృష్ణన్. అప్పటికే సినిమా కోసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేసాడు. దీంతో ఆర్థిక పరమైన సమస్యలు కూడా చుట్టు ముట్టాయని తెలుస్తోంది. విషయాలను ఆయన తన తల్లిదండ్రులకు కూడా చెప్పి బాధ పడ్డట్లు తెలుస్తోంది.

అయితే ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహించ లేదని అంటున్నారు. 'అవరుడే రవుకల్' సినిమాలో అసిఫ్ అలీ, ఉన్ని ముకుందన్, అజు వర్ఘీస్, వినయ్ ఫోర్ట్, హనీ రోజ్ తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలకావాల్సి ఉంది. ఈ చిత్రానికి శాలిన్ మహ్మద్ దర్శకత్వం వహించారు.

English summary
Ajay Krishnan, the producer of theAsif Ali - Unni Mukundan starrer Avarude Ravukal,committed suicide on April 24. It's reported that the young producer took the drastic step being gripped by financial constraints.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu