అసలు భాగోతం బయటపడింది.. అవసరాల శ్రీనివాస్ మామూలోడు కాదు!
సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అలా తాజాగా అవసరాల శ్రీనివాస్ తన సినిమా కోసం ఓ ఎత్తుగడ వేశాడు.అది బాగానే సక్సెస్ అయింది. అయితే మ్యాటర్ మాత్రం జనాల్లోకి వెళ్లింది. కానీ అవసరాల ప్రమోషన్స్ ట్రిక్స్ మాత్రం అందరూ ఇట్టే పసిగట్టేశారు. నిన్న అవసరాల శ్రీనివాస్, తన కోడైరెక్టర్ ఆడిన భాగోతం ఇప్పుడు బయటపడింది. అది తమ సినిమా ప్రమోషన్స్ కోసమని ఇప్పుడు అందరికీ క్లియర్‌గా తెలిసింది.
మ్యూజిక్ మాంత్రికుడి మరో అవతారం.. నిర్మాతగా మారిన ఏఆర్ రెహ్మన్!

వీడియో వైరల్..
అవసరాల శ్రీనివాస్ దగ్గర మూడేళ్లుగా కో డైరెక్టర్‌గా పని చేశానని, తనను అవమానించి ఆఫీస్ నుంచి గెంటేశాడని తెగ వాపోయాడు. ఈ మేరకు ఓ వీడియోను వదిలాడు సదరు కో డైరెక్టర్. అంతేకాకుండా అవసరాల అసలు రూపం చూపిస్తానని కాస్త ఓవర్ యాక్షన్ కూడా చేశాడు.

జీవించిన అవసరాల..
అయితే అది ప్రమోషనల్ వీడియో అని ఏ మాత్రం అనుమానం రాకుండా అవసరాల కూడా బాగానే జీవించేశాడు. ఈ వీడియో బయటకు వెళ్తే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి అలా తన ఫస్ట్ లుక్‌ను అందరికీ పరిచయం చేశాడు. బట్టతలతో జనాలు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారని అలా చిన్నగా టెస్ట్ చేసుకున్నట్టున్నాడు.

ఇదంతా ఆ సినిమా కోసమే..
చాలా రోజుల తరువాత అవసరాల శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా రాబోతోందనే వార్తలు ఎప్పటి నుంచి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో టైటిల్‌ను కూడా వెరైటీగా ప్లాన్ చేశారని, నూటొక్క జిల్లాల అందగాడు అని అనుకుంటున్నారని అప్పట్లో రూమర్లు కూడా వచ్చాయి. అయితే నిన్న బయటకు వదిలిన వీడియో కూడా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగమనే అర్థమవుతోంది.
Recommended Video

వెరైటీ పాత్రలో..
నూటొక్క జిల్లాల అందగాడు అనే టైటిల్‌కు అవసరాల శ్రీనివాస్ కనిపిస్తున్న లుక్కుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. బట్టతల ఉన్నా కూడా అందరినీ మోసం చేసే పాత్రలో అవసరాల కనిపిస్తోన్నట్టున్నాడు. గొత్తి సూర్యనారాయణ పాత్రలో అవసరాల ఇలా కొత్త అవతారంలో కనిపించబోతోన్నాడు. త్వరలోనే టీజర్ రాబోతోందంటూ ఓ పోస్టర్‌ను వదిలారు.


Click it and Unblock the Notifications











