ఫస్ట్ లుక్ చూస్తూంటే....బాబు..బాగా బూతని క్లారిటీ వచ్చేస్తోంది

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న 'బాబు బాగా బిజీ' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

By Srikanya

హైదరాబాద్ : వాస్తవానికి ఈ మద్యకాలంలో అడల్ట్ మూవి సినిమాలు తెలుగులో తగ్గాయనే చెప్పాలి. ఇంటర్నెట్ లో డైరక్ట్ గా ...సినిమాలు దొరికుతున్నాయి..ఇంక ఈ సినిమాలు పనిగట్టుకుని ఎవరు చూస్తారు అనుకున్నారో ఏమో వాటి జోలికి పోలేదు. అప్పటికీ మారుతి..ఈ రోజుల్లో చిత్రంతో బూతుని మరోసారి పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసి, ట్రెండ్ సెట్ చేద్దామనుకున్నారు. కానీ అదీ జరగలేదు. మార్కెట్ లో ఈ పరిస్దితిని గమనించినట్లున్నారు అభిషేక్ పిక్చర్స్ వారు.

బూతు సినిమాలు రావటం లేదనే భాధపడే వారిని ఓదార్చడానికా అన్నట్లు, బూతు సినిమాలకు తిరిగి పాత వైభవం తీసుకురావాలనకున్నట్లున్నారు అభిషేక్ పిక్చర్స్ వారు. అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నవీన్‌ మేడారంను దర్శకుడిగా పరిచయం చేస్తూ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బాగా బిజీ' . ఈ సందర్భంగా... హోళీ కానుకగా బాబు బాగా బిజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

Avasarala's 'Baabu Baaga Busy' first Look
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని చూస్తూంటే ఏ రేంజిలో బూతుని ఈ సినిమాలో కుక్కటానికి ప్రయత్నించారో అర్దమవుతోంది. అఫ్ కోర్స్ సినిమా చివర్లో మాంచి సందేశం కూడా ఉండే ఉంటుంది లెండి.

బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఇది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ... రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. హిందీలో హంటర్ సినిమా చూసినప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. ఇందులో అవసరాల శ్రీనివాస్ హీరోగా అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాం. దర్శకుడు నవీన్ మేడారం... అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది.

అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. హోళీ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలకు తగ్గట్టుగా సురేష్ భార్గవ విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 13న బాబు బాగా బిజీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. అని అన్నారు.

అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా..... కుమ్ముడే కుమ్ముడు. ఇందులో శ్రీముఖి, మిస్తీ చక్రవర్తి, తేజస్వీ, సుప్రియ హీరోయిన్లు. తేజస్వి మడివాడ, సుప్రియా ఐసోలా, శ్రీముఖి హీరోయన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణ, ప్రియదర్శి, రవిప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X