»   » జో అచ్యుతానంద..! ఏమిటీ ట్విస్టూ...! అవసరాల అక్షరాలా ఆడేసుకుంటున్నాడు

జో అచ్యుతానంద..! ఏమిటీ ట్విస్టూ...! అవసరాల అక్షరాలా ఆడేసుకుంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నారా రోహిత్ .. నాగశౌర్య .. రెజీనా ప్రధానమైన పాత్రలను పోషించిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.అవసరాల శ్రీనివాస్. "ఊహలు గుసగుసలాడే" లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయయిన అవసరాల.. తన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా "జ్యో అచ్యుతానంద". ట్రైలర్... టీజర్ రెండూ జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. స్వయంగా రాజమౌళి లాంటి వాడు ఈ సినిమా సూపర్‌ హిట్టవడం గ్యారెంటీ అని విడుదలకు ముందే ప్రకటించేశాడు. ట్రైలర్‌ చూసి మెస్మరైజ్‌ అయిపోయానని.. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అనిపిస్తోందని అన్నాడు రాజమౌళి. ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా క్లైమాక్స్‌ ఏమై ఉంటుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని. చెప్పటం తో మరింతగా అంచనాలు పెరిగాయి.

అయితే ఈ విషయంలో అవసరాల సంతోషంగా లేడట... ఔను..! అవసరాల భయపడుతున్నాడు చెప్తున్నాడు. ట్రై లర్ చూసి ఇది లవ్ స్టోరీ అనుకొని తీరా వెళ్ళాక కాదని తెలిస్తే నిరాశకు గురౌతారనీ అది సినిమా సక్సెస్ మీద ప్రభావం చూపుతుందనీ భయపడుతున్నాడు. ఎందుకంటే అంతా అనుకుంటున్నట్టు జో అచ్యుతానంద లవ్ స్టోరీనే కాదట. ఆ విశయమే కొత్త గా విడుదలైన పోస్టర్ లో చెప్పేసాడు కూడా... అందులో హీరోలిద్దరికీ పెళ్లయినట్లు.. వాళ్లిద్దరి జీవితాల్లో వేరే అమ్మాయిలున్నట్లు సంకేతాలిచ్చాడు.... ఈ కంఫ్యూజన్ ని తట్టుకోలేక తికమక పడిపోతున్నారు జనం. అసలు విషయం ఏమిటో స్లైడ్ షో లో చూదండీ...


ఇద్దరబ్బాయిలూ...ఒకమ్మాయి కథ:

ఇద్దరబ్బాయిలూ...ఒకమ్మాయి కథ:

ఊహలు గుసగుసలాడే సినిమా తోనే దర్శకుడిగా "అవసరాల" అవసరం చిన్న సినిమాలకి ఎంత ఉందో అర్థమైపోయింది. జో అచ్యుతానంద అనే ఇద్దరబ్బాయిలూ...ఒకమ్మాయి కథ మళ్ళీ ఒక సారి మనముందుకు వచ్చే ప్రయత్నం లో ఉన్నాడు శ్రీనివాస్.


ట్రయాంగిల్ లవ్ స్టోరీ :

ట్రయాంగిల్ లవ్ స్టోరీ :

జ్యో అచ్యుతానంద' టీజర్.. ట్రైలర్ చూసి.. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నారు జనాలు. ఇద్దరు అన్నదమ్ములు.. ఒకమ్మాయి ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశారో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించాడు అవసరాల.


విపరీతమైన క్రేజ్:

విపరీతమైన క్రేజ్:

"జ్యో అచ్యుతానంద". ట్రైలర్... టీజర్ రెండూ జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. స్వయంగా రాజమౌళి లాంటి వాడు "ఈ సినిమా సూపర్‌ హిట్టవడం గ్యారెంటీ అని విడుదలకు ముందే ప్రకటించేశాడు. ట్రైలర్‌ చూసి మెస్మరైజ్‌ అయిపోయానని.. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అనిపిస్తోందని" చెప్పటంతో ఒక్కసారిగా జో అచ్యుతానంద మీద అంచనాలు ఊహించంత ఎక్కువగా పెరిగిపోయాయి.


ముక్కోణ ప్రేమకథ :

ముక్కోణ ప్రేమకథ :

ఇద్దరు అన్నాదమ్ములూ...ఒక అమ్మాయీ మధ్య జరిగే ముక్కోణ ప్రేమకథ గా జో అచ్యుతానంద చూడటానికి సిద్దం అన్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు అందరికీ సూపర్ షాక్ ఇచ్చాడు అవసరాల శ్రీను.


అందరికీ షాకిచ్చాడు:

అందరికీ షాకిచ్చాడు:

కానీ అంతలోనే ఒక షాకింగ్ పోస్టర్ రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చాడు. అందులో హీరోలిద్దరికీ పెళ్లయినట్లు.. వాళ్లిద్దరి జీవితాల్లో వేరే అమ్మాయిలున్నట్లు సంకేతాలిచ్చాడు. ఇద్దరు అబ్బాయిలు - ఒక అమ్మాయి కనిపిస్తుంటే దీన్ని అందరూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నారని...


ఇదసలు లవ్ స్టోరీయే కాదు:

ఇదసలు లవ్ స్టోరీయే కాదు:

కానీ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీకాదు కాదు.. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇదసలు లవ్ స్టోరీయే కాదు.. అన్నదమ్ముల మధ్య సాగే ఒక భావోద్వేగభరిత ప్రయాణం మాత్రమే అని చెబుతున్నాడు దర్శకుడు అవసరాల. ఈ సినిమాలో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉంటుందని.. అదే కథను నడిపిస్తుందని.. చెప్పాడు.


ముందే ఎందుకు? :

ముందే ఎందుకు? :

ఐతే థియేటర్లో సర్ ప్రైజ్ చేయకుండా.. ముందే అవసరాల ఈ విషయాన్ని ఎందుకు రివీల్ చేశాడా అని అందరికీ సందేహం కలిగింది. ఒక వేళ అందరికీ తెలియని షాకింగ్ ట్విస్ట్ ఉంటే మంచిదే కదా అనుకోవచ్చు కానీ అవసరాల సమాధానం వేరుగా ఉంది.


ముగింపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది:

ముగింపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది:

ఈ సినిమాలో కథానాయకులిద్దరికీ ముందుగానే పెళ్లిళ్లు అయినట్టుగా ఫస్టు షాట్ లోనే చెప్పేశాననీ, అక్కడి నుంచి కథను ఎలా నడిపించాననేదే ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. గతంలో ఈ తరహా కథలు వచ్చినట్టు అనిపించినా, తాను ఇచ్చిన ముగింపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పాడు.


కానీ మరో గాసిప్ ఏమిటంటే:

కానీ మరో గాసిప్ ఏమిటంటే:

అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్లు బాగా పెరిగిపోవటమే కాదు. ఇదో ట్రయంగిల్ లవ్ స్టోరీ అని బలంగా ఫిక్సైపోయారు జనం. అదే ఉద్దేశం ట్రైలర్ కూడా కలిగించింది.


రాజమౌళి కూడా:

రాజమౌళి కూడా:

ఇక దీనికి తగ్గట్టే దర్శక దిగ్గజం రాజమౌళి కూడా... "ఈ సినిమా క్లైమాక్స్‌ ఏమై ఉంటుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని.. అసలు రెజీనా ఎవరిని ప్రేమిస్తుందే అనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోందని.. అందుకే తాను ఈ సినిమాను ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లాగా భావిస్తున్నా" అంటూ చెప్పటం తో అదే క్లైమాక్స్ కి రెడీ అయిపోతున్నారు ప్రేక్షకులు.


కొత్త రకం క్లైమాక్స్:

కొత్త రకం క్లైమాక్స్:

ఊహించని మలుపు సినిమాకి ఎంత ప్లస్ ఔతుందో కొన్ని సార్లు అదే ఊహించని మలుపు సినిమా మీద కూడా పెద్ద నెగెటివ్ ప్రభావం చూపే అవకాశమూ ఉంది. దాంతో జరగ బోయే ప్రమాదాన్ని ఊహించిన అవసరాల ముందే కొంత క్లూ ఇవ్వటం ద్వారా... "కొత్త రకం క్లైమాక్స్" కి ముందే సిద్దం చేస్తున్నాడు ప్రేక్షకులని.


అదిరిపోయే క్లైమాక్స్‌:

అదిరిపోయే క్లైమాక్స్‌:

"చివర్లో ఏమవుతుందన్నది సినిమాలో చూడాల్సిందే. అవసరాల శ్రీనివాస్‌ ఈ సినిమాకు అదిరిపోయే క్లైమాక్స్‌ రాశారు. ఈ స్క్రిప్ట్‌లో క్లైమాక్స్‌ని ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు" అని రోహిత్‌ చెప్పాడు. సినిమా అంతటా ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ ప్రేక్షకుల్ని వెంటాడుతుందని.. ఒక ఆశ్చర్యకర క్లైమాక్స్‌ చూసి మంచి అనుభూతితో ప్రేక్షకులు బయటికి వస్తారని నారా రోహిత్ చెప్పటం కూడా ఇదే వ్యూహం లో భాగం అని అనుకుంటున్నారు.


English summary
Jo Achytananda Direcoter Avasarala Srinivas Reveald the twist of the Movie. he said that Jo Achytananda is not a Triangle Love Story..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu