»   »  అవసరాల శ్రీనివాస్ అడల్ట్ మూవీ: మత్తెక్కిస్తున్న ప్రీ లుక్ (ఫోటో)

అవసరాల శ్రీనివాస్ అడల్ట్ మూవీ: మత్తెక్కిస్తున్న ప్రీ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీలో సూపర్ హిట్టయిన అడల్ట్ మూవీ 'హంటర్' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'సోగ్గాడు' అనే టైటిల్ ఖరారు చేసారు. 'బాబు చాలా బిజీ' అనేది సబ్ టైటిల్.

ఈ సినిమాలో మిష్టి చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోలా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్టు డిమాండ్ మేరకు అవసరాల, ఈ నలుగు భామల మధ్య హాట్ హాట్ సీన్లు ఉండబోతున్నాయి.

త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పస్ట్ లుక్ కంటే ముందు... ప్రీ లుక్ రిలీజ్ చేసారు.

 ప్రీ లుక్ ఇదే

ప్రీ లుక్ ఇదే

ప్రీ లుక్ పోస్టరే ఈ రేంజిలో ఉంటే .... మరి ఫస్ట్ లుక్ ఏ రేంజిలో ఉంటుందో అంటూ అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.

 అవసరాల శ్రీనివాస్

అవసరాల శ్రీనివాస్

'అష్టాచమ్మా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. తర్వాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయడం ద్వారా అటు నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

 అటు దర్శకుడిగా సినిమాలు చేస్తూ...

అటు దర్శకుడిగా సినిమాలు చేస్తూ...

అప్పుడప్పుడు నటుడిగానే తన సత్తా చాటుకుంటున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్... ఇటీవల విడుదలైన 'జెంటిల్‌మన్' సినిమాలో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

 డిఫరెంట్ రోల్

డిఫరెంట్ రోల్

నటుడిగా కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా తనలోని వివిధ షేడ్స్ ను ప్రదర్శించి టాలెంటు నిరూపించుకోవాలని ఉవ్విల్లూరుతున్న అవసరాల శ్రీనివాస్ ఈ సారి ‘సోగ్గాడు' సినిమా ద్వారా డిఫరెంటుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 సోగ్గాడు మూవీలో అవసరాల పరిశీలిస్తే..

సోగ్గాడు మూవీలో అవసరాల పరిశీలిస్తే..

పదిహేనేళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుండే విపరీతమైన సెక్స్ కోరికలు ఉండే ఆ కుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. ఇక కాలేజీ రోజుల్లోకి వచ్చాక అమ్మాయిలతో ఎఫైర్లు, పెళ్లైన ఆంటీతో వివాహేతర సంబంధాలు...ఇలా లైఫ్ సాగిస్తుంటాడు.

 సెక్స్ అవసరమే అని వాదించే పాత్ర

సెక్స్ అవసరమే అని వాదించే పాత్ర

మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించే క్యారెక్టర్. ఎఫైర్లకు, అక్రమ సంబందాలు పులిస్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్న అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా.

 తెలుగులో?

తెలుగులో?

అయితే హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యం అవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలియాస్తాయా? దర్శకుడు ఈ సినిమాను తెరపై ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికగా మారింది.

 ఏమాత్రం తగ్గకుండా

ఏమాత్రం తగ్గకుండా

బాలీవుడ్లో ఈ సినిమా ఎలా ఉంటుందో.. టాలీవుడ్లోనూ అంతే బోల్డుగా, ఎమోషనల్ గా ఉంటుందని అవసరాల శ్రీనివాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. .

 మీనింగ్ ఉండే సినిమా..

మీనింగ్ ఉండే సినిమా..

అడల్ట్ కామెడీ అనగానే అంతా ఏదో ఊహించుకుంటారు.. కానీ ఈ సినిమాలో చాలా లోతైన మీనింగ్ ఉంటుంది అంటున్నారు అవసరాల శ్రీనివాస్.

 గుల్షన్ దేవయ్య

గుల్షన్ దేవయ్య


హిందీలో గుల్షన్ దేవయ్య పొషించిన సెక్స్ అడిక్ట్ రోల్ తెలుగులో అవసరాల శ్రీనివాస్ చేస్తున్నారు.

రెమ్యూనరేషన్

రెమ్యూనరేషన్


అవసరాల శ్రీనివాస్ రెమ్యూనరేషన్... ఆశ్చర్యపరిచే విషయాలు!

అవసరాల శ్రీనివాస్ రెమ్యూనరేషన్... ఆశ్చర్యపరిచే విషయాలు!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
The pre-look of 'Soggadu', the remake of Bollywood adult comedy 'Hunterrr', is out. Starring Srinivas Avasarala as the hero, it's directed by Naveen Medaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu