అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెట్టిన కోడైరెక్టర్.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్

టాలీవుడ్ ప్రేక్షకులకు అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నటుడు, దర్శకుడిగా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకున్నాడు. విలన్‌ రోల్స్‌లోనూ మెప్పించేశాడు. ఇక డైరెక్టర్‌గా అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాలు, సున్నితత్త్వంతో కూడుకున్న కథలు, హాస్యాన్ని అందించడంలో ఆయన శైలి వేరు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు.

వీడియో చక్కర్లు..

వీడియో చక్కర్లు..

ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన వద్ద పని చేసిన కో డైరెక్టర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. అకారణంగా తనను తిట్టి అవతలకి గెంటేశాడనే అక్కసును వెళ్లగక్కాడు. అంతే కాకుండా అవసరాల అసలు స్వరూపాన్ని బయటపెట్టేశాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కో డైరెక్టర్ ఫైర్..

కో డైరెక్టర్ ఫైర్..


మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను.. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి నన్ను బయటకు పంపించేశాడు. ఒక్కటంటే ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి అంటూ అసలు సంగతి బయటపెట్టేశాడు.

బండ బూతులు..

బండ బూతులు..

ఫోటో షూట్ చేయించుకుంటున్న అవసరాల శ్రీనివార్ రూంలోకి వెళ్లాడు సదరు కో డైరెక్టర్. అతడ్ని చూసిన వెంటనే అవసరాల ఫైర్ అయ్యాడు. ఏయ్ నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి అంటూ బండ బూతులు తిట్టేశాడు. అవతలి మనిషి కూడా ఏం తగ్గకుండా.. నేను మూడేళ్లుగా మీ దగ్గర కష్టపడుతున్నా.. నన్నెందుకు తిట్టావ్.. ఎందుకు బయటకు పంపేశావ్ అని రివర్స్‌లో ఫైర్ అయ్యాడు.

బట్టతలతో..

బట్టతలతో..

ఎవడ్రా లోపలకి పంపించింది అంటూ అవసరాల ఫైర్ అవుతుండగా.. సదరు కో డైరెక్టర్ ఓ పని చేసేశాడు. అవసరాల ధరించిన టోపీని తీసేశాడు. దీంతో అతని బట్టతల బయటకు కనిపించింది. ఈ వీడియో బయటపెడితే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అని అవసరాల వార్నింగ్ ఇచ్చాడు. అతను మాత్రం తగ్గకుండా.. అన్నింట్లో పెట్టేస్తాను అని చెప్పుకుంటూ వెళ్లాడు.

 ప్రమోషన్స్ కోసం ఫీట్లు..

ప్రమోషన్స్ కోసం ఫీట్లు..

మొత్తానికి ఈ తతంగాన్ని చూస్తుంటే ఏదో తేడా కొడుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంత ఈజీగా వీడియో ఎలా బయటకు వస్తుందని, ఇవన్నీ కూడా సర్కస్ ఫీట్లు అని, సినిమా ప్రమోషన్స్ కోసమే ఇలా చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X