ఆస్తులు పంచే వరకే తండ్రి, కట్నం ఇచ్చే వరకే మామ.. ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా ఆర్జీవీ!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ, ఆ తర్వాత ఆయన కుటుంబంలో, రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని 'అవసరం' అనే వీడియో సాంగ్ ని ఆర్జీవీ రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్

ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్

ఆర్జీవీ విడుదల చేసిన ఈ సాంగ్ ఎమోషనల్ గా ఉంటూనే ఎన్టీఆర్ కుటుంబాన్ని, చంద్రబాబుని టార్గెట్ చేసే విధంగా ఉంది. అవసరం అనే పాటలో చాలా తీవ్రమైన పదాలనే ఉపయోగించారు. ఎన్టీఆర్ ని చివరి రోజుల్లో ఆయన కుటుంబ సభ్యులు ఎలా గాలికి వదిలలేశారో తెలియజేస్తూ ఈ పాట సాగుతోంది. కొద్ది సేపటి క్రితమే వర్మ ఈ సాంగ్ ని ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.

ఘాటైన విమర్శలతో లిరిక్స్

ఈ పాటలోని లిరిక్స్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని విమర్శించే విధంగా ఉన్నాయి. 'ఆస్తులన్నీ పంచేవరకే తండ్రి అవసరం.. వరకట్నం ఇచ్చేవరకే మామ అవసరం' అంటూ ఈ పాట సాగుతోంది. 'కాయలమ్మే టప్పుడే చెట్టు పేరు అవసరం.. మోడుబారాక ఎవ్వరికి లేదు దాని అవసరం', అధికారం ఉన్నప్పుడే రాజు అవసరం.. అది పోయినప్పుడు లేదు అవసరం' అనే లిరిక్స్ ఈ సాంగ్ లో ఉన్నాయి. బతికుండగా గుండెనెంతో భాద పెట్టినా.. పోయాక దండవేసి దండమవసరం అనే లిరిక్ కూడా ఉంది. ఈ లిరిక్ ప్లే అవుతున్నప్పుడు వీడియో సాంగ్ లో చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి దండవేసే ఫోటోని చూపించారు.

వైస్రాయ్ సంఘటన

వైస్రాయ్ సంఘటన

వీడియో సాంగ్స్ లోనే ఆర్జీవీ ఇంతలా ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటే.. సినిమాలో వచ్చే వైస్రాయ్ హోటల్ సంఘటనని ఇంకెంత ఘాటుగా చూపించి ఉంటాడో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి ఆయన మరణించే వరకు ఈ చిత్రం సాగుతుందని వర్మ తెలిపాడు.

 కళ్యాణ్ మాలిక్

కళ్యాణ్ మాలిక్

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి కీరవాణి సోదరుడు కళ్యాణ్ మాలిక్ సంగీత దర్శకుడు. ఈ పాటకి గేయ రచయిత సిరా శ్రీ సాహిత్యం అందించారు. ఎమోషనల్ గా సాగే ఈ పాటని విల్సన్ హెరాల్డ్ పాడారు. మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X