Avatar 2: అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్.. దడ పుట్టిస్తున్న సినిమా టిక్కెట్ల రేట్లు!

వరల్డ్ నెంబర్ వన్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తెరపైకి తీసుకు వస్తున్న అద్భుత సృష్టి అవతార్ విడుదల కావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల రేట్లు ఏ స్థాయిలో ఉంటాయి అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఇండియాలో కూడా అవతార్ 2 సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం టికెట్లు రేట్లపై సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఏరియాలలో రేట్లు అయితే ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి వెళితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే విధంగా కామెంట్ చేస్తున్నారు.

 Avatar 2 the way of water movie india tickets prices shocking

ముఖ్యంగా బెంగళూరులో అయితే ఐమాక్స్ 3D ఫార్మాట్లో సినిమా చూసేందుకు ఒక టికెట్టు ధర 1450 రూపాయలకు నిర్ణయించారు. దేశంలో ఇదే అత్యధిక రేటు కావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ తర్వాత పూణేలో 4DX 3D ఫార్మట్ లో చూసేందుకు ఒక్క టికెట్ ధరను 1200 రూపాయలకు కేటాయించారు. ఇక ఢిల్లీలో 1000 రూపాయలకు పైగా అదే ఫార్మాట్లో ఒక టికెట్ ధరను అమ్ముతున్నారు. ఇక తర్వాత అహ్మదాబాద్లో 750 రూపాయలు, ఇండోర్లో 700 రూపాయలు ముంబైలో 970 రూపాయలకు అత్యధిక రేట్లలో అవతార్ 2 టికెట్లు అమ్ముడవుతున్నాయి.

 Avatar 2 the way of water movie india tickets prices shocking

మంగళవారం నుంచి ఈ సినిమా టికెట్లను అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇక బుకింగ్స్ ఓపెన్ అయినా కొన్ని నిమిషాల్లోనే రేట్లతో సంబంధం లేకుండా కొన్ని మల్టీప్లెక్స్ లో హౌస్ ఫుల్ బోర్డుకు పడేలా అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక హైదరాబాదులో అయితే 4DX 3D ఫార్మాట్లో ఒక్క టికెట్ 350 రూపాయలకు నిర్ణయించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది తక్కువ స్థాయిలో టికెట్ల రేట్లు అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. వైజాగ్ లో అత్యధికంగా 3D ఫార్మాట్ లో ఒక్క టికెట్ కు 250 రూపాయలను నిర్ణయించారు. మరి ఈ రేంజ్ టికెట్లో రేట్లతో సినిమా ఇండియాలో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

 Avatar 2 the way of water movie india tickets prices shocking

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X