అవతార్ దర్శకుడి కోసం ‘కొచ్చాడయాన్’ షో

By Bojja Kumar

హైదరాబాద్: రజనీకాంత్, దీపిక పదుకొనె జంటగా నించిన 'కొచ్చాడయాన్' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని 'అవతార్' చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్‌కు కూడా చూపించబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకురాలు సౌందర్య స్వయంగా వెల్లడించారు.

సౌందర్య మాట్లాడుతూ...జేమ్స్ కామెరూన్‌కి నేనొక పెద్ద అభిమానిని. నా సినిమా కొచ్చాడియాన్ తప్పకుండా ఆయనకు చూపిస్తాను. ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సౌందర్య వెల్లడించారు. ఇండియన్ సినిమాల చరిత్రలో ఇదొక ల్యాండ్ మార్క్ అవుతుందని తెలిపారు.

Avatar Creator James Cameron To Watch Tamil Film Kochadaiyaan

'కొచ్చాడయాన్' చిత్రం విడుదల ముందే సంచలనాలు సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే రూ. 15 కోట్లు వెచ్చిస్తున్నారట. తమిళ, తెలుగు, హిందీతో పాటు పంజాబీ, భోజ్పురి, మరాఠి భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ప్రచారం అదరగొట్టనున్నారు. ఒక్క చెన్నై సిటీలోనే నాలుగు వేల హోర్డింగులు ఏర్పాటు చేయబోతున్నారట. మరి ఇంత భారీగా ఖర్చు పెడుతున్న ఈచిత్రం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.

ఈ సినిమా తెలుగులో విక్రమ్ సింహా టైటిల్ తో రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. అయితే ఈ తెలుగు వెర్షన్ కు గాను ఎంత ఖర్చు పెట్టారు...ఏ రేంజిలో బిజినెస్ అవుతుందనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఈ చిత్రం రైట్స్ ని రెండేళ్ల క్రితం తీసుకోవటానికి సుబ్రమణ్యం ఎగ్రిమెంట్ రాసారు. మొత్తం తెలుగు వెర్షన్ కు గానూ 28 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ డబ్బింగ్ చిత్రానికి ఇంత మొత్తం పెట్టలేదు. అయితే రజనీ గత చిత్రం రోబో దాదాపు 28 కోట్లు వసూలు చేయటంతో ఈ మొత్తం వెచ్చించినట్లు చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే అది పెద్ద సంచలన విజయం సాధించాలని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X